గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కలెక్టరేట్ ముందు ధర్నా
వినూత్న నిరసన వంటావార్పు
తక్షణమే వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతాం
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
జనగామ : గ్రామపచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్( సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించి వంటా వార్పుతో కలెక్టరేట్ ముందు సహపంక్తి భోజనాలు చేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఆరు నెలలుగా వేతనాలు లేకుండా పస్తులతో పనిచేస్తున్న పరిస్థితి దాపురించిందని తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు దిగుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో కామారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ సిబ్బంది కొంగరి బాబు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడంటే గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు మా పంచాయతీ సిబ్బంది ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు మరణించి కొంగరి బాబు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామపంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు ఉద్యోగ భద్రత పర్మినెంట్ తదితర డిమాండ్ల సాధన కోసం గ్రామపంచాయతీ సిబ్బంది సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు
ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ &వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తిని వెంకన్న నారోజు రామచంద్రం సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజయేందర్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు మల్లాచారి ,బసవ రామచంద్రు రామ్ నారాయణ గుర్రం లాజర్ బోస్ రాజు తిప్పారపు యాకూబ్ జగన్ కుంభం రాజు బాలనర్సయ్య, సత్యనారాయణ రమేష్ వెంకట్ రెడ్డి ఐలయ్య వెంకటరమణ శ్యామ్ గంగరబోయిన మల్లేష్ రాజ్ సుదర్శన్ వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
0 Comments