గోరేటి వెంకన్న చాకిరితో ఒళ్ళు పులిసిన బతుకులకు నల్ల తుమ్మ నీడను పరచి సేదతీర్చే పాటల చెలికాడు, మోటగిరకల్లో ఆటలాడే పిల్లల అల్లరిలో దుముకులాడే గిజిగాడు, కంచెరేగు తీపు లచ్చుమమ్మ కంఠంలో పలికించే పాటగాడు, కూతగాడు, రాతగాడు. ప్రజా వాగ్గేయకారుడు పల్లెపదాల పాటలో సంధించే విలుకాడు.మిత్రునికి డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం ప్రజా ప్రేమికులందరికి గర్వకారణం.గోరేటి వెఃకన్నకు విజ్ఞానదర్శిని అభినందనలు.
Osmania University confers honorary doctorate on folk singer Goreti Venkanna
0 Comments