ముగ్గురు విద్యార్థులకు గాయాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటున్న తల్లిదండ్రులు
పాఠశాలలో చదువుతున్న 601 విద్యార్థులకు ఒక పాత భవనంలో వసతి ఏర్పాటు చేసిన అధికారులు, భోజన విరామం సమయం కావడంతో విద్యార్థులంతా తినడానికి వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్న విద్యార్థులు
భోజనం చేసి హాస్టల్ భవనం ముందు నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా భవనం కూలడంతో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు విద్యార్థులు తిరూర్ జ్ఞానేశ్వర్(10వ తరగతి), శివ(ఇంటర్ ఫస్ట్ ఇయర్), అరవింద్(6వ తరగతి)
గాయాలపాలైన విద్యార్ధులను వెంటనే ఆసుపత్రికి తరలించి, శిథిలాల కింద ఉన్న విద్యార్థుల వస్తువులు తీసే క్రమంలో పూర్తిగా నేలమట్టమైన భవనం
ఘటనా స్థలానికి చేరుకుని, భవనం ఇంత శిథిలావస్థలో ఉంటే అధికారుల దృష్టికి ఎందుకు తీసుకారలేదని, కూలిపోయే సమయంలో లోపల విద్యార్థులు ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా అని గురుకుల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటు చేసిన అధికారులు
0 Comments