రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతున్నాయి
(KVPS) కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
మంగళవారం హన్మకొండ టీఎస్ యుటిఎఫ్ భవన్ లో కేవిపిఎస్ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జన జాతర సభ నిర్వహించారు
(KVPS) కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షత వహించారు
ప్రధాన వక్తగా హాజరైన కెవిపిఎస్ (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ
పూలే అంబేద్కర్ లాంటి మహనీయులను భారత దేశంలో ఒక కులానికి పరిమితం చేయటం ద్వారా వారిని అవమానిస్తున్నారని ఆధునిక భారతానికి నిర్మాతలు అనే విషయాన్ని నేటితరం మర్చిపోతుందన్నారు వేల సంవత్సరాల మనుస్మృతి శూద్రులకు విద్యను నిషేధిస్తే, పూలే దంపతులు అందరికీ విద్య కోసం తుది శ్వాస వరకు కృషి చెప్పారు మహిళా సమానత్వం కోసం నాటి ఆటవిక సమాజాన్ని నాగరిక సమాజంగా మార్చారని కొనియాడారు మనువాద సంస్కృతిపై పూలే నడిపిన ఉద్యమాలు సంస్కరణలు భారతదేశం నేటి స్థితికి చేరిందన్నారు మెజారిటీ ప్రజల కోసం నాడు పూలే నడిపిన ఉద్యమాలు ముఖ్య భూమిక పోషించాయన్నారు వితంతువులకు శరణాలయాలు శూద్రులు అస్పృశ్యులకు పాఠశాల నెలకొల్పడం వంటి కార్యక్రమాలతో పాటు సత్యశోధకు సమాజ్ ను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారని చెప్పారు ఆయన అందరికీ విద్య కోసం కృషి చేస్తే నేటి మనువాద పాలకులు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కాసులు ఉన్న కొందరికి కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని అట్టడుగు వర్గాలకు నూతన జాతీయ విద్యా విధానంతో రిజర్వేషన్స్ లేకుండా చేశారన్నారు పూలే ఆశయాలకు విరోధిగా కేంద్ర బిజెపి సర్కార్ పని చేస్తుందన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
కేవలం భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కొలుస్తూ ఆయన అధ్యయన లోతులను విస్మరిస్తున్నారని చెప్పారు భూమి జాతీయకరణ జరగాలని పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా హక్కు ఉండాలని నాడే ఆయన రాష్ట్రాలు మైనార్టీలు అనే పుస్తకంలో ప్రస్తావించారని చెప్పారు మహిళా సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి నాటి ప్రభుత్వం అంగీకరించకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు నేడు కేంద్ర బీజేపీ సర్కార్ విధానాల వల్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు దేశంలో పౌరులందరికీ హక్కులు కల్పించిన రాజ్యాంగమే కనుమరుగ అయ్యే ప్రమాదం ఉందన్నారు ప్రజ స్వామ్య దేశాన్ని మతరాజ్యంగా మార్చే కుట్రలు చేస్తున్నారని దీంతో అట్టడుగు వర్గాలకు ఈపాటి హక్కులు ఉండవన్నారు భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ గుండెకాయ లాంటిదని దాన్ని రక్షించుకోవడం నేటి తరం కర్తవ్యం కావాలన్నారు ప్రైవేట్ రంగం 85 శాతానికి పెరిగిందని అందులో రిజర్వేషన్స్ లేకుండా సామాజిక న్యాయం ఎలా సాధమన్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మహా ఉద్యమం జరగాలన్నారు పూలే అంబేద్కర్ పుట్టిన ఏప్రిల్ నెలలను కేవీపీఎస్ మహనీయుల మాసంగా పాటి స్తుందన్నారు కుల వివక్ష అంటరానితనంపై పూలే అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు
ఈ కార్యక్రమంలో (KVPS) కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం దశరథ్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రభాకర్ రెడ్డి బొట్ల చక్రపాణి మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు వెంకట్ (KVPS) కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ జిల్లా నాయకులు ముడుసు నారాయణ జి అశోక్ దానబోయిన రాంబాబు గాదె రమేష్ జిల్లా కమిటీ సభ్యులు సుకర్ణ రెనుకుంట్ల చందర్ కొడేపాక సదయ్య వేల్పుల రవి వేలు సుమన్ కుమ్మరి రవీందర్ కుమారస్వామి లతీఫ్ మల్లయ్య యాకయ్య విజయ సుభద్ర మమత తదితరులు పాల్గొన్నారు
0 Comments