OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

మనువాదమే దేశానికి మహాప్రమాదం పూలే అంబేద్కర్ లు ఆధునిక భారత నిర్మాతలు Humanism is a great danger to the country. Phule Ambedkar and others are the builders of modern India.

పూలే అంబేద్కర్ జనజాతర సభలో ప్రముఖ అంబేద్కర్ వాది జే బి రాజు

మతోన్మాద కార్పోరేట్ విధానాల పై ఐక్య ఉద్యమాలు

కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
Humanism is a great danger to the country. Phule Ambedkar and others are the builders of modern India.

    మహాత్మా జ్యోతిబాపూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు తుది శ్వాస వరకు మనువాదానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించారని వారే మన ఆధునిక భారతావని నిర్మాతలని వారు చూపిన మార్గములో నేటితరం మనువాదంపై మహోద్యమం చేపట్టాలని ప్రముఖ అంబేద్కర్ వాది రిటైర్డ్ ఐ ఐ ఎస్ అధికారి జేబీ రాజు పిలుపునిచ్చారు
    ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఫూలే అంబేద్కర్ జన జాతర సభ జరిగింది కేవీపీఎస్ గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షులు ఎం దశరథ్ అధ్యక్షత వహించారు పూలే అంబేడ్కర్ చిత్రపటాలకు ప్రముఖ అంబేద్కర్ వాది జేబీ రాజు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్యఅతిథిగా హాజరైన జేబీ రాజు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ లాంటి మహనీయులను భారత దేశంలో ఒక కులానికి పరిమితం చేయటం ద్వారా వారిని అవమానిస్తున్నారని ఆధునిక భారతానికి నిర్మాతలు అనే విషయాన్ని నేటితరం గ్రహించాలన్నారు
Humanism is a great danger to the country. Phule Ambedkar and others are the builders of modern India.


    వేల సంవత్సరాల మనుస్మృతి శూద్రులకు విద్యను నిషేధిస్తే, పూలే దంపతులు అందరికీ విద్య కోసం తుది శ్వాస వరకు కృషి చేశారని అన్నారు మహిళా సమానత్వం కోసం నాటి ఆటవిక సమాజాన్ని నేటి ఆధునిక సమాజంగా మార్చారని కొనియాడారు మనువాద సంస్కృతిపై పూలే నడిపిన ఉద్యమాలు సంస్కరణలు భారతదేశం నేటి స్థితికి చేరిందన్నారు మెజారిటీ ప్రజల కోసం నాడు పూలే నడిపిన ఉద్యమాలు ముఖ్య భూమిక పోషించాయన్నారు వితంతువులకు శరణాలయాలు శూద్రులు అస్పృశ్యులకు పాఠశాల నెలకొల్పడం వంటి కార్యక్రమాలతో పాటు సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారని చెప్పారు ఆయన అందరికీ విద్య కోసం కృషి చేస్తే నేటి మనువాద పాలకులు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కాసులు ఉన్న కొందరికి కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని అట్టడుగు వర్గాలకు నూతన జాతీయ విద్యా విధానంతో రిజర్వేషన్స్ లేకుండా చేశారన్నారు పూలే ఆశయాలకు విరోధిగా కేంద్ర బిజెపి సర్కార్ పని చేస్తుందన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కేవలం భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కొలుస్తూ ఆయన అధ్యయన లోతులను విస్మరిస్తున్నారని చెప్పారు భూమి జాతీయకరణ జరగాలని పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా హక్కు ఉండాలని నాడే ఆయన రాష్ట్రాలు మైనార్టీలు అనే పుస్తకంలో ప్రస్తావించారని చెప్పారు మహిళా సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి నాటి ప్రభుత్వం అంగీకరించకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు నేడు కేంద్ర బీజేపీ సర్కార్ విధానాల వల్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు దేశంలో పౌరులందరికీ హక్కులు కల్పించిన రాజ్యాంగమే కనుమరుగ అయ్యే ప్రమాదం ఉందన్నారు ప్రజ స్వామ్య దేశాన్ని మతరాజ్యంగా మార్చే కుట్రలు చేస్తున్నారని దీంతో అట్టడుగు వర్గాలకు ఈపాటి హక్కులు ఉండవన్నారు భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ గుండెకాయ లాంటిదని దాన్ని రక్షించుకోవడం నేటి తరం కర్తవ్యం కావాలన్నారు ప్రైవేట్ రంగం 85 శాతానికి పెరిగిందని అందులో రిజర్వేషన్స్ లేకుండా సామాజిక న్యాయం ఎలా సాధమన్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మహా ఉద్యమం జరగాలన్నారు
Humanism is a great danger to the country. Phule Ambedkar and others are the builders of modern India.

కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ
    కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రెండు తలల పాముల దేశ ప్రజలపై విషం చెబుతుందన్నారు విద్వేషాలు రెచ్చగొట్టడమే విధానంగా పెట్టుకున్న పార్టీ అని విమర్శించారు కార్పొరేట్ శక్తులతో మమేకమవుతూ కష్టజీవులపై నేను భారాలు మోపుతున్నారని విమర్శించారు కాశ్మీర్ మహాల్గాం ఉగ్రవాద దాడిని దేశం ఏకధాటిపై కి వచ్చి ఐక్య గొంతుతో ఖండించాలన్నారు ఉగ్రవాద దాడిని దేశంలో మత కలహాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్న మనువాద విధానాన్ని ప్రతిఘటించాలన్నారు కేంద్ర ప్రభుత్వ భద్రత వైఫల్యం సరిహద్దుల్లో సరిపడు సైన్యాన్ని రిక్రూట్ చేయకపోవడం వల్ల ఉగ్రదాడి జరిగిందన్నారు ఉగ్రవాదులకు మతం కులం ఉండదని మానవ మారన హోమమే వారి అభిమతం అని చెప్పారు పూలే అంబేద్కర్ పుట్టిన ఏప్రిల్ నెలలను కేవీపీఎస్ మహనీయుల మాసంగా పాటి స్తుందన్నారు కుల వివక్ష అంటరానితనంపై పూలే అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం కృపాసాగర్ ఎన్ బాల పేరు గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి బిట్ర సుబ్బారావు సామాజిక కార్యకర్త తెలంగాణ శ్యామ్ కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జి మనోహర్ నాయకురాలు
బి రేణుక వివిధ సామాజిక ప్రజాసంఘాల నాయకులు కెవిపిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Humanism is a great danger to the country. Phule Ambedkar and others are the builders of modern India.

Post a Comment

0 Comments