హైదరాబాద్:నవంబర్ 14
పిట్టగూడు వేదికగా రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎవరి కుట్ర? ఏంటా ఆ కుట్ర? అంటూ ట్వీటాస్త్రాలు సంధించారు.
నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో..రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్చడం కుట్ర కాదా? అని మండిపడ్డారు.
తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం వెనుక ఎవరి కుట్ర ఉంది..? పేద లంబాడా రైతులను బెదిరించడం వెనుక ఎవరి కుట్ర ఉంది..? మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టించడం వెనుక ఎవరి కుట్ర ఉంది అని ప్రశ్నించారు.
50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు.. రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఏదో ఒక కేసులో ఇరికించి..అరెస్ట్ చేయిస్తారని..తనకు ఎప్పుడో తెలుసని..రైతుల గొంతైనందుకు నన్ను అరెస్టు చేస్తారా? అరెస్ట్ చేస్తే గర్వంగా పోతానని ట్వీట్ చేశారు కేటీఆర్.
Will I be arrested if I side with the farmers?
KTR tweeted that he would be proud if he were arrested.
0 Comments