జనగామ: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జనగామ జిల్లా మూడో మహాసభలు పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరిగింది మహాసభల ప్రారంభ సూచికగా జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షురాలు ఇవి అహల్య చేయడం జరిగింది. చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యంలో ఫోటోలకు పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ఈ మహాసభకు అధ్యక్షులుగా ఇర్రి అహల్య వ్యవహరించారు *ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి గారు మాట్లాడుతూ*........
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల పురిటి గడ్డ, మొదట తిరుగుబాటు ప్రారంభించిన చాకలి ఐలమ్మ మలు స్వరాజ్యంల వారసత్వముగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తుందని ముఖ్యంగా 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలో వచ్చిన నాటి నుండి మహిళా హక్కులను కాలరాస్తూ మహిళా చట్టాలను నీరు గారు మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతూ న్నాయని అన్నారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యేలు మహిళలపై విద్యార్థినులపై అత్యాచారాలు మానభంగాలు చేస్తున్నారని, మణిపూర్ రాష్ట్రంలో మహిళలను వివస్త్రాలను చేసి రోడ్లమీద ఏడ్చుకుంటూ పోతున్న ప్రధానమంత్రి నోరు మెదపడం లేదని గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లింలను ఊచకోతకోసి ముస్లిం మహిళ అయినా బిల్కీస్ భాను పై 11 మంది దుర్మార్గులు అత్యాచారం చేసి కుటుంబ సభ్యులందరినీ నిర్దాశన్యంగా సంచివేసినటువంటి చరిత్ర బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళలకు ఎటువంటి హక్కు లేనటువంటి పరిస్థితి ఉన్నదని ఉన్నారు ఇట్టి విషయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో కేసు వేసి 11 మంది దుర్మార్గులను తిరిగి జైలుకు పంపించిన చరిత్ర మన సంఘానికి ఉన్నదని అదేవిధంగా బిజెపి నిత్యవసర సరుకులను విపరీతంగా పెంచి కొనుగోలు శక్తి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందని మహిళా రిజర్వేషన్ బి ల్లును 33% పెంచుతూ చట్టం చేసినప్పటికీ పది సంవత్సరాల తర్వాత అమలు చేయాలని బిజెపి దుర్మార్గమైన ఆలోచన సరైంది కాదని విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనియెడల మహిళల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు అనంతరం ర్యాలీ నిర్వహించి జనగామ అంబేద్కర్ చౌరస్తా వద్ద బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలోఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాయకురాలు ఆశ లత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షబానా జిల్లా నాయకులు పందిళ్ళ కళ్యాణి మోకు భవాని సిహెచ్ శ్రీలత సౌందర్య నిర్మల రమాదేవి నిర్మల కావ్య మమత రజిత రమ పుల్లమ్మ రాములమ్మ మంగమ్మ అనిత అంజమ్మ సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు
0 Comments