OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

ఏండ్లు గా గురుకులాల్లో సుధీర్ఘ అనుభవంతో పనిచేస్తున్న గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులను కొనసాగించాలి - మాజీ మంత్రి కొప్పుల


హైదరాబాద్ :

అంధకారంలోకి బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ల గురుకుల విద్యార్థుల భవిష్యత్తు. గౌలిదొడ్డి గురుకులం మళ్ళీ శిథిలావస్థకు చేరుకోనున్నది. ఒకనాడు కూడా ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలో అడుగుపెట్టలేదు. తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న దాదాపు 2000 మంది పార్ట్ టైం ఉద్యోగులు తొలగించడం పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాల పై కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమను చూపిస్తోందని కొప్పుల ఈశ్వర్ అన్నారు..! గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారంతో మ‌ర‌ణాల సంఘటన మరువకు ముందే, గురుకులాల్లో ఆర్సీవోలు గెస్ట్‌, పార్ట్‌టైం ఫ్యాకల్టీల ఎంపికలో అవినీతి దందా బయటపడిందని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,500-3,000 ఖాళీలు పాతవారికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ కొత్తవారితో భర్తీ అంటూ ఒక్కో అభ్యర్థి నుంచి 50 వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల గురుకులాలకు ఉన్నతాధికారులు గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేసి పోస్టులను భర్తీ చేశారని ఆరోపణలు వచ్చాయన్నారు.  పదేండ్లపాటు విద్యాబోధన చేసిన పార్ట్ టైం ఉపాధ్యాయులను తొలగించడం వల్ల బిసి,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ల గురుకుల విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న దాదాపు 2 వేల మంది పార్ట్ టైం ఉద్యోగులు తొలగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దాదాపు రెండు లక్షల మంది ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. ఈ నిర్ణయాల వల్ల గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎంతో శ్రద్ధతో నిర్మించిన గురుకుల వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పర్మినెంట్‌ ఉద్యోగాల భర్తీ పేరు తో పాతవారిని తీసేసారా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు..?

మొత్తంగా అన్ని సొసైటీల్లో అన్ని క్యాడర్లలో 2,500 నుంచి 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల స్థానంలో సుధీర్ఘ అనుభవంతో పనిచేస్తున్న గెస్ట్, పార్ట్‌టైం ఉద్యోగులనే కొనసాగించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు..! వారిని పరిగణనలోకే తీసుకోకుండా కొత్తవారిని నియమించడమేమిటని ప్రశ్నించారు.‌

ఇప్పటికే వారికి చెల్లించాల్సిన 3 నెలల జీవితాల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు చెల్లించాలన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు వల్ల 38 ప్రతిభా పాఠశాలలు (సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్) లు, 24 క్రీడా అకాడమీలు మ్యూజిక్ స్కూల్,  సైనిక్ స్కూల్, మహిళా సైనిక్ స్కూల్ కళాశాల, న్యాయ కళాశాల 35 ఒకేషనల్ కళాశాలలో ఇవన్నీ మూతపడే ప్రమాదం ఉందని అన్నారు. ఇక గౌలిదొడ్డి గురుకులం మళ్ళీ శిథిలావస్థకు చేరుకోనున్నది. ఈ ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలో ఒకనాడు కూడా అడుగుపెట్టలేదని ఎద్దేవాచేశారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు నుండే విద్యార్థులకు ఇవ్వాల్సిన వస్తువులన్నింటినీ సమకూర్చే ప్రక్రియ మొదలయ్యేది. కానీ ఇప్పుడు పాఠశాల మొదలయ్యి మూడు నెలలైనా పిల్లలకు యూనిఫామ్, మాట్రీస్లు, బూట్లు నైట్ డ్రెస్ లు, ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు..! కేసీఆర్ గారైతే కోట్ల రూపాయల పారితోషం ఇచ్చారని గుర్తుచేశారు. 

Guest and part-time employees with long experience in Gurukuls should be retained

Post a Comment

0 Comments