అల్పపీడన ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.
తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు: IMD (Heavy rains in Telangana for five days)
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాగల 5 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
0 Comments