మద్యం, డ్రగ్స్ ను నియంత్రించాలి విద్యా, వైద్యంఉచితంగా ఇవ్వాలి.
ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టీ.జ్యోతి AIDWA
సూర్యాపేట:మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సమానత్వం కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )(AIDWA) కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో రెండు రోజులపాటు జరగనున్న ఐద్వా (AIDWA) సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ మద్యం, డ్రగ్స్ ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గత పది సంవత్సరాల కాలంలో దేశంలో మహిళలపై హత్యలు హత్యాచారాలు పెరిగాయన్నారు. అనేక చట్టాలు వస్తున్నప్పటికీ వాటిని సక్రమమైన పద్ధతిలో అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా లోకం తమ హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. న్యూయార్క్ నగరంలో కుట్టు మిషన్ లో పనిచేసే శ్రామిక మహిళలు ఎనిమిది గంటల పని దినం కావాలి, అని పని ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, శ్రమకు తగ్గ వేతనం కావాలని, ఓటు హక్కు కావాలని, రక్తతర్పణం చేసి హక్కులు సాధించుకున్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనిది అన్నారు. మహిళలు అన్ని రంగాలలో విద్యా, వైద్యంలో క్రీడాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు పోతున్న మహిళల పట్ల వివక్షత, అసమానత లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి అని ఆవేదన చెందారు. లింగ సమానత్వ సూచిలో 146 దేశాలకు గాను 127 స్థానంలో మన దేశం ఉందని ఆవేదన చెందారు. సాధించుకున్న హక్కులు నిర్వీర్యం అవుతున్నాయి. మహిళల హక్కులు పరిరక్షించబడాలంటే నిర్ణయ అధికారంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. మహిళలకు పని, మహిళలకు భద్రత కల్పించాలనికోరారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. వాటిని కల్పించే వరకు మహిళలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మహిళపై హింస, లైంగిక వేధింపులు అనేక రూపంలో జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అన్నారు. మహిళలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు వెంటనే అమలు చేయాలి
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ (State Chief Secretary of Aidwa Mallu Laxmi)
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైనా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) (Aidwa) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో రెండు రోజులపాటు జరగనున్న ఐద్వా సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, సబ్సిడీ గ్యాస్ 500లకు వరకు హామీలు అమలు చేసిన ప్రభుత్వం మిగతా హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజలకు అవసరమైన విద్యా,వైద్యం ఉచితంగా అందించుటకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్రంగా సర్వేలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కార్యక్రమం రూపొందించినట్లు తెలియజేశారు. సమ భావన సంఘాల మహిళలకు అందాల్సిన పావలా వడ్డీ నేటికీ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సమభావన సంఘాల మహిళలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై అనేక అగైత్యాలు జరుగుతున్నాయని వృద్ధుల నుండి పసి పిల్లల వరకు అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంaచేశారు. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దోషులనుశిక్షించాలని డిమాండ్ చేశారు.1981 నుండి నేటి వరకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐద్వా నిరంతరం పనిచేస్తుందన్నారు. ఐద్వా పోరాట ఫలితంగాఅనేక హక్కులు,చట్టాలు వచ్చాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తినే తిండి పై, వేసుకునే బట్టలపై ఆంక్షలు విధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్ కిస్ భాను, కతువా, మహిళా రెజ్లర్, మణిపూర్ ఘటన చూస్తే ఈ దేశంలో మహిళల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న తీరు అర్థం అవుతుందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రం అని ఆనాడు గాంధీ అన్నాడని నేడు పట్టపగలే ఆడపిల్లలు ఒంటరిగా నడిచే పరిస్థితి లేదన్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ శిక్షణ తరగతుల ప్రారంభ సూచికంగా ఐద్వా (Aidwa) జెండాను సీనియర్ నాయకురాలు గోలి భాగ్యమ్మ ఆవిష్కరించారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్ గా ఐద్వా (Aidwa) జిల్లా ప్రధాన కార్యదర్శి మేకన బోయిన సైదమ్మ వ్యవహరించారు. కర్తవ్యాలను ఐద్వా (Aidwa) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మద్దెల జ్యోతి ప్రవేశపెట్టారు. ఈ శిక్షణ తరగతులలో ఐద్వా జిల్లా నాయకురాలు జూలకంటి విజయలక్ష్మి, అండం నారాయణమ్మ, సురభి లక్ష్మి, మునగాల జడ్పిటిసి దేవి రెడ్డి జ్యోతి, సృజన, నెమ్మాది లక్ష్మి, ముల్కురి మణెమ్మ, ఎడమ పద్మతదితరులు పాల్గొన్నారు.
0 Comments