“నేనున్నాను"..ధైర్యంగా ఉండండి.*
*”ఎవ్వరికీ భయపడాల్సిన అవసరంలేదు.”
“ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తా.”
“పొదలకూరు పర్యటనలో నాయకులకు, కార్యకర్తలకు భరోసానిచ్చిన కాకాణి.”
కాకాణి పర్యటన సందర్బంగా నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడిన పొదలకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం.
నెల్లూరు జిల్లా:
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యాలయంలో అధిక సంఖ్యలో విచ్చేసిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి (Dr. Kakani Govardhan Reddy)గారు
కాకాణి మాట్లాడుతూ...
👉రాష్ట్రంలో చంద్రబాబు పాలన (Chandrababu Naidu) అభివృద్ధి, సంక్షేమంతో కాకుండా విభిన్నంగా విధ్వంస కాండతో ప్రారంభించారు.
👉ఆధిపత్యం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకులపై, వారి ఆస్తులపై తెలుగుదేశం (TDP) నాయకులు దాడులు చేస్తున్నారు.
👉రాష్ట్రంలో పార్టీలు అన్ని ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు (YS Jaganmohan reddy) ఒక్కరికే 40శాతం ఓటు శాతాన్ని ప్రజలు అందించారు.
👉జగన్మోహన్ రెడ్డి గారి (YS Jaganmohan reddy) నాయకత్వం రాష్ట్రంలో పటిష్టంగా ఉందని ప్రజలు నిరూపించారు.
👉ప్రజలకు అండదండలు అందించడమే ప్రధాన ధ్యేయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ముందుకు వెళ్తుంది.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి వాడ, ప్రతి వీధి అభివృద్ధి చేశాం.
👉రైతులకు, సామాన్యులకు అందుబాటులో ఉండి, అండగా నిలిచి, అండదండలు అందించాం.
👉40శాతం ఓటు శాతాన్ని అందించిన ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు(YS Jaganmohan reddy) ప్రతిపక్ష హోదాను కోరుతున్నారు.
👉 రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లగల్గుతారు.
👉 రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర లేకపోతే ప్రభుత్వం నిర్వీర్యం అవుతుంది.
👉 తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి, ప్రణాళికను ప్రజలకు తెలియజేయాలి.
👉 సర్వేపల్లి ప్రజలకు అధికారంలో ఉన్నా, లేకపోయినా మీ ఇంటిబిడ్డగా అండగా నిలుస్తాను.
👉తెలుగుదేశం పార్టీ చోటా నాయకుల ఉడుత బెదిరింపులకు భయపడవలసిన అవసరం లేదు.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారి చేతనే తిరిగి కట్టించే రోజు వస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా..
👉వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పక్షాన నిలబడి, నాకు అండగా నిలిచి, ఓట్లు వేయించిన నాయకులకు, కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు పేరు, పేరున ధన్యవాదాలు.
0 Comments