OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయ


దిల్లీ: గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆమె ఎక్స్‌(X Twitter) వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐటీ సేవ (IT Services) ల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. 

●  తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌(X Twitter) వేదికగా పోస్టు చేశారు.

Post a Comment

0 Comments