OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

సిఎఎ రద్దయ్యే వరకూ పోరాటం : సిపిఎం పొలిట్‌బ్యూరో


న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్‌ను సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు సిపిఎం పొలిట్‌బ్యూరో మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన పౌరసత్వం యొక్క లౌకిక సూత్రాన్ని సిఎఎ ఉల్లంఘిస్తుంది. చట్టం కింద నోటిఫై చేసిన నియమాలు.. పొరుగు దేశాల నుండి వచ్చే ముస్లింల పట్ల కూడా ఈ వివక్షాపూరిత విధానాన్ని అమలు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం మూలాలు ఉన్న పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయాందోళనలను పెంచుతోంది. తమ రాష్ట్రంలో పౌరసత్వం కోసం వ్యక్తులను గుర్తించే, నమోదు చేసుకునే ప్రక్రియ నుండి రాష్ట్ర ప్రభుత్వాల్ని మినహాయించే విధంగా ఈ నిబంధనలు రూపొందించడ్డాయి. సిఎఎని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించడానికే ఈ నిబంధనలు రూపొందించబడ్డాయని స్పష్టమౌతోంది.

సిఎఎను ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు ఈ చట్టం నిబంధనల నోటిఫికేషన్‌ వెలువడటం అంటే, తమ ప్రయోజనాల కోసం సిఎఎ అమలును ఉపయోగించాలని బిజెపి కోరుకుంటుందని స్పష్టమౌతోంది. సిఎఎ అమలును, ఈ హానికరమైన ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాడుతుందని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొన్నది.

కాగా, ఈ చట్టాన్ని అమలు చేయబోదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాలు కూడా సిఎఎను తీవ్రంగా వ్యతిరేకించాయి.

Post a Comment

0 Comments