కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాధపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు నిధులను తక్షణమే విడుదల చేయాలని రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాడు కడప నగరంలోని విశ్వనాధపురం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అధికార యంత్రాంగం స్పందించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్పొరేషన్ అధికారులు నిధులు కేటాఇంచామని చెబుతున్నా విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. కార్పొరేషన్ నిధులతో, లేదా ప్రభుత్వం నిధులతో పెండింగ్లో ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తక్షణమే పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు ప్రస్తుతం వెంటనే పనులు ప్రారంభించక పోతే ఆ తర్వాత వర్షాకాలం వస్తుందని అప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాబట్టి అధికారం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు విశ్వనాధపురం వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సాధన కమిటీ సభ్యులు రాజారెడ్డి, విజయభాస్కర్, ఖాదర్ భాషా, విజయమ్మ, నాగేశ్వరరావు, ఐకాన్ విల్లా ప్రతినిధులు రామమోహన్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, తిమ్మయ్య, కళ్యాణ్ పాల్గొన్నారు.
Nagella Ramakrishna Reddy, Convener of Railway Under Bridge Implementation Committee, demanded immediate release of funds to complete the construction of railway under bridge between Kadapa city Erramukkapally and Viswanadhapuram.

0 Comments