OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

పత్తి రైతులకు తక్షణ న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత డిమాండ్

Immediate justice should be given to cotton farmers Kalvakuntla Kavitha demands
 జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గత ఏడాది పంటకు 80 శాతం పైగా జీవోటీ (GOT) ఫలితాలు వచ్చి
న విత్తన పత్తికి ఇప్పటికీ చెల్లింపులు చేయకపోవడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లో, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో రైతు ప్రతినిధులతో కలిసి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిను కలిసి వినతి పత్రం అందజేశారు.

హామీలు అమలు చేయాలి

జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటీవల నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రైతులు వెల్లడించిన సమస్యలను ప్రస్తావిస్తూ, గతంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 80 శాతం పైగా జీవోటీ ఫలితాలు సాధించిన విత్తన పత్తికి చెల్లింపులు చేస్తామని కంపెనీలు, ఆర్గనైజర్లు హామీ ఇచ్చిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. అయితే, ఆ హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పెరిగిన పెట్టుబడులకు సరిపడ రేట్లు కావాలి

ఎరువులు, కార్మిక వ్యయాలు, సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో విత్తన పత్తి ప్యాకెట్‌పై ధరలను పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇకపై కంపెనీలు రైతులతో ఖచ్చితంగా త్రైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు.

ఈ అంశాలపై చర్చించిన అనంతరం రైతు కమిషన్ సానుకూలంగా స్పందించినట్లు గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు. త్వరలోనే గద్వాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

రైతుల ఆత్మగౌరవం, జీవనాధారాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

Post a Comment

0 Comments