OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

లాకప్ డెత్ కు గురై వంద రోజుల క్రితం మరణించిన కర్ల రాజేష్ మృతదేహానికి ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగా రీ- పోస్టుమార్టం

As a result of the MRPS struggle, a re-postmortem was conducted on the body of Karla Rajesh, who died 100 days ago after suffering a lockup death.

 కోదాడలో పోలీసుల దాడిలో లాకప్ డెత్ కు గురై వంద రోజుల క్రితం మరణించిన కర్ల రాజేష్ మృతదేహానికి ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగా ఈరోజు రీ- పోస్టుమార్టం జరుగుతుంది. కర్ల రాజేష్ ను సమాధి చేసిన ప్రాంతానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులతో కలిసి విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు. పోలీసులు, ఎమ్స్ వైద్యులు రీపోస్టుమార్టానికి సంబంధించిన ప్రాసెస్ పంచనామా తయారు చేసి రి-పోస్టుమార్టానికి సిద్ధం చేశారు. రాజేష్ ను పోలీసులే చట్టవిరుద్ధంగా చిత్రహింసలకు గురిచేసి చంపారు.. దీనికి బాధ్యులైన పోలీసులందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే.. పోలీసులను కూడా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే.. ఎవ్వరిని వదిలిపెట్టం. నేడు రీ- పోస్టుమార్టం జరుగుతుందంటేనే అది ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితం.. నిర్విరామంగా వంద రోజులుగా పోలీసుల తప్పులపై, పాలకుల నిర్లక్ష్యంపై ఎమ్మార్పీఎస్ న్యాయ పోరాటం చేస్తూ కొట్లాడింది.. ఎమ్మార్పీఎస్ పెట్టుకున్న డిమాండ్లను ఒక్కొక్కటిగా అమలు పరిచేలా చేస్తున్నది.. That is MRPS. MANDA KRISHNA MADIGA..

MRPS పోరాట ఫలితంగా..

CI, SI మీద కస్టోడియల్ డెత్, చిత్రహింసలు, అట్రాసిటీ కేసులు అయ్యాయి..

సిఐ సస్పెండ్, ఎస్సై రెడ్డి కాబట్టి ట్రాన్స్ఫర్ SP కి అటాచ్ చేశారు.

మొన్న రాజేష్ తల్లికి ఉద్యోగం ఇచ్చారు.

అంతకు ముందు ఫెన్షన్, గ్రాసరీ ఇచ్చారు

ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు..

మూడు ఎకరాల భూమి ప్రొసీడింగ్స్ సిద్ధం చేశారు..

నేడు రీ- పోస్టుమార్టం జరుగుతుంది.

ఇగ మిగిలింది SI సస్పెన్షన్.. బాధ్యులైన పోలీసులపై, పోస్టుమార్టం రిపోర్టును తప్పుగా మార్చిన డాక్టర్లపై, పర్యవేక్షణ చేయని ముషీరాబాద్ తాసిల్దార్ ఇతర అధికారులపై చర్యలు.. అవి కూడా ఒక్కొక్కటిగా జరుగుతూనే ఉంటాయి.

న్యాయం కోసం కోట్లాడుతూనే ఉంటాం..

- రాగల్ల ఉపేందర్ మాదిగ

MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Post a Comment

0 Comments