వృద్ధులు,వికలాంగుల కష్టాలు పట్టించుకునే వారు లేరా..?
ఎవరి వార్డులో వాళ్లకి పెన్షన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న వృద్ధులు..
వారు ఇచ్చే పెన్షన్ ఆటో చార్జీలకే సరిపోతున్నాయ్ అంటున్న వికలాంగులు.. .jpeg)
సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కు తాళం పడింది.మూడు రోజులుగా పోస్టాఫీసు తెరుచుకోక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని శుక్రవారం పోలగాని బాలు గౌడ్ ఆరోపించారు.పెన్షన్ కోసం రోజు పోస్టాఫీస్ కు వస్తున్నా తాళం ఉంటోందని 7,8,9,21,23 వార్డు ల కౌన్సిలర్లకు కి చెప్పామని తెలిపారు.పోస్ట్ ఆఫీసుల వద్ద పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి నిరీక్షణ, సాంకేతిక సమస్యలు,చిల్లర డబ్బుల కొరత వంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం వల్ల నెలనెలా డబ్బులు తీసుకోవడంలో అవస్థలు పడుతున్నారు.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పోస్టల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో కార్యాలయం తెరిపించాలని ఎవరి వార్డులో వాళ్లకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలగాని బాలు గౌడ్ కోరారు.

0 Comments