OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

బ్రాహ్మణిజం అంటే ? What is Brahmanism?

What is Brahmanism

1. మనిషికి మనిషి పుట్టలేదు అని చెప్పేది.
2. మనిషి కుండలనుంచీ, చెమటనుంచీ, ముక్కునుంచీ, చెట్టునుంచీ, పాయసంనుంచీ వివిధ జంతువులనుంచీ పుట్టాడని చెప్పేది.
3. మంత్రాలు తాయత్తులు మహిమగలవి అని చెప్పేది.
4. గోవర్ధనగిరిని చిటికెన వేలిపై ఎత్తాడు అనేది.
5. నూరు పుట్లగదతో యుద్ధం చేశాడనేది.
6. మంధర పర్వతాన్ని తాబేలు మోసింది అని చెప్పేది.
7. బాణంతో భూమిలోనుండి నీళ్లు రప్పించాడు అనేది
8. గుర్రంతో కలిస్తే పిల్లలు పుట్టారు అనేది.
9. పైన దేవలోకం కింద పాతాళం ఉంటాయని చెప్పేది.
10. వర్షాలు పడాలన్నా, పిల్లలు పుట్టాలన్నా యజ్ఞాలు, హోమాలు చేయాలని చెప్పేది.
11. పాములు, పందులు,కోతులూ,పక్షులూ,కప్పలూ,గాడిదలు,గుర్రాలూ మాట్లాడతాయని చెప్పేది.
12. సూర్యునికీ,చంద్రునికీ, వాయుకీ, అగ్నికీ,యమునికీ పిల్లలు పుట్టారు అని చెప్పేది.
13. రాహుకేతువులు సూర్యున్నీ, చంద్రున్నీ మింగుతాయని చెప్పేది.
14. ముఖంనుంచీ,భుజాల నుంచీ, పిరుదుల నుంచీ, పాదాలనుంచీ మనుషులు పుడతారని చెప్పేది
15. కొమ్ములు, కోరలతో వికారంగా ఉండే మనుషులు ఉంటారని చెప్పేది.
16. చచ్చినవాళ్లు బ్రతుకుతారనీ, చచ్చి మళ్లీ పుడతారనీ చెప్పేది.
17. రాళ్లకు, రప్పలకు మహిమలు ఉంటాయని వాటిని పూజించమనీ చెప్పేది.
18. ఏపనీ చేయకుండా దేవున్ని నమ్ముకుంటే పని జరుగుతుంది అని చెప్పేది.
19. మంచి రోజులు, చెడు రోజులు, మంచి ఘడియలు, చెడుఘడియలు ఉంటాయని చెప్పేది.
20. తుమ్మినా,మనుషులు ఎదురొచ్చినా పనులు జరగవు అనేది.
21. ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడు, ప్రత్యక్షమౌతాడు కోర్కెలు తీరుస్తాడని చెప్పేది.
22. నదులు, సముద్రాలు మాట్లాడతాయనీ, నదిని తొలగి దారి ఇవ్వమంటే దారి ఇచ్చిందని చెప్పేది.
23. రోగాలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్ధిస్తే నయమవుతుంది అనేది.
24. వాస్తూ, జ్యోతిష్యాలను చెప్పేది.
25. దిష్టి తగులుతుంది, దోషము ఉంది, వాటికి శాంతి చేయమనీ, కొబ్బరికాయలు కొట్టమనీ, నిమ్మకాయలు కొయ్యమనీ చెప్పేది.
26. స్వర్గము, నరకము ఉంటాయనీ, మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకమూ కలుగుతాయని చెప్పేదీ.
27. కులము, మతము ఉంటాయనీ పెద్ద కులపోళ్లు మంచి పనులూ, తక్కువ కులపోళ్లు హీనమైన పనులు చేయాలని చెప్పేది.
28. పనులు చేసేవాళ్ళు హీనులనీ, మంత్రాలు చదివేవాడు, జనాన్ని మోసం చేసేవాడు గొప్పవాడు అనీ చెప్పేది.
29. కొంతమందికి దానమిస్తే మంచి జరుగుతుందనీ, పనులు జరుతాయనీ,స్వర్గానికి వెల్తారని చెప్పేది.
30.తక్కువ కులపోల్లు,స్త్రీలూ చదువుకోరాదనీ, ఆస్తి సంపాదించుకోకూడదనీ, ఈరెండూ పెద్దకులపోల్లకు మాత్రమే సొంతమని చెప్పేది.
-- Uyyala Surendar

What is Brahmanism?

Post a Comment

0 Comments