దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ కిడ్నాప్–హత్య కేసులో శంషాబాద్ జోన్ పరిధిలోని షాద్‌నగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. హత్యలో ప్రమేయం ఉన్న ఎనిమిది మందిని గుర్తించిన పోలీసులు, వీరిలో ఏడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు గణేష్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
షాద్‌నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
నిందితుల వివరాలు
హత్యకు ప్రధాన సూక్ష్మకర్త ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కాగుల వెంకట్ అతనితో పాటు:
-
పత్తి శీను (ట్రాక్టర్ డ్రైవర్)
-
వడ్డే నర్సింలు — వికారాబాద్ జిల్లా పూడూరు
-
గౌతాపూర్ గ్రామానికి చెందిన గణేష్ (పరారీలో)
-
సోమ సురేష్ అలియాస్ సోమచంద్ కుమార్ — నజీబ్‌నగర్
-
బిజ్జు రాఘవేందర్ — రంగంపల్లి
-
ఆవుల శ్రీకాంత్ (డీసెంట్ డ్రైవర్)
-
కానుగుల రాములు
మొత్తం ఎనిమిది మంది ఈ హత్యలో నేరుగా పాల్గొన్నట్లు పోలీసులు ధృవీకరించారు.
ప్రేమ వ్యవహారం నేపథ్యంగా హత్య
రాజశేఖర్ భార్య ఎర్రవాణి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం—ఈ నెల 12వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వెంకటేష్ మరియు మరో ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చి “మాట్లాడాల్సి ఉంది” అంటూ రాజశేఖర్‌ను బయటకు పిలిచి తీసుకువెళ్లారు.
పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి అయ్యాయి:
-
రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ మరియు భవాని మధ్య ప్రేమ వ్యవహారం ఉంది.
-
ఆ ప్రేమను రాజశేఖర్ మద్దతు ఇచ్చాడు.
-
భవాని తండ్రి వెంకటయ్య తక్కువ కులం కారణంగా ఈ సంబంధాన్ని వ్యతిరేకించాడు.
-
రాజశేఖర్ ఈ ప్రేమకు సహకరిస్తున్నాడని భావించిన వెంకటేష్, అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇన్నోవా కారులోనే హత్య
కిడ్నాప్ చేసిన అనంతరం రాజశేఖర్‌ను ఇన్నోవా కారులో ఎక్కించి అన్నారం జంక్షన్ వైపు తీసుకెళ్లారు. కారులోనే:
-
నిందితులు నైలాన్ తాడుతో గొంతు లాగి,
-
కొందరు కాళ్లు పట్టుకొని,
-
రాజశేఖర్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నవాబుపేట అడవుల్లో శవదహనం
తరువాత నిందితులు కారును రామేశ్వరం వైపు మళ్లించి,
నవాబుపేట సరిహద్దులోని నిర్మానుష ప్రదేశానికి వెళ్లి:
-
శవాన్ని కారులోనుంచి దించి,
-
ప్లాస్టిక్ డబ్బాలో తెచ్చుకున్న 6 లీటర్ల పెట్రోల్‌ను మృతదేహంపై పోసి,
-
అగ్గిపెట్టతో శవానికి నిప్పంటించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
పోలీసుల స్వాధీనం
అరెస్ట్ చేసిన ఏడుగురి వద్ద నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నవి:
-
రెండు బైకులు
-
రెండు కార్లు
-
రూ. 6,500 నగదు
-
ఒక సెల్ ఫోన్
-
ఇన్నోవా కార్ RC
-
ప్రధాన నిందితుడు వెంకటేష్ వద్ద ఉన్న "మీడియా ప్రెస్ ఐడి కార్డు"
దర్యాప్తు పర్యవేక్షణ
ఈ కేసు పూర్తిగా
శంషాబాద్ DCP రాజేష్ పర్యవేక్షణలో జరగ్గా,
ఎసిపి లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్, ఎస్ఐ శరత్‌కుమార్ సహా పోలీసులు నిందితుల గుర్తింపు, అరెస్టులో కీలక పాత్ర పోషించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీరికి రివార్డులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
Kidnapping and murder of Dalit youth Rajasekhar: Love affair is the reason!
.jpeg)

0 Comments