![]() |
| Oursocietytv |
భూపాలపల్లి: దేశ నిర్మాణంలో నిజాయితీ, పారదర్శకత కీలకమని, అవినీతిని వెలికితీసి సమాజానికి సేవ చేస్తున్న వారిని దేశభక్తులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది అని జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
అవినీతి బహిర్గతం చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు, ఉద్యోగులపై సమాచారం ఇచ్చి, అవినీతి బయటపడేలా చేస్తున్న పౌరులను ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవించాలి అని ఆయన సూచించారు.
అవినీతి నిరోధక శాఖ (ACB)కి సమాచారం అందించిన వారికి అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
అవినీతి కేసులో సస్పెండ్ కాబడిన ఉద్యోగి పని చేసిన అదే స్థానంలో ఖాళీ అయిన ఉద్యోగాన్ని…
ఎసీబీకి సమాచారం ఇచ్చిన వ్యక్తికి ప్రాధాన్యతగా ఇవ్వాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా చేస్తే అవినీతి పుట్టే అవకాశాలు గణనీయంగా తగ్గి, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పరిపాలన ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎసీబీ పనితీరును ప్రశంసించిన తోట రాజయ్య
తమ బాధ్యతలను నిజాయితీగా, ధైర్యంగా నిర్వర్తిస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆయన అభినందించారు.
“Telanganaలో ACB అధికారులు అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు” అని రాజయ్య ప్రశంసించారు.
అవినీతి రుజువైతే శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలి
ఒక్కసారి అయినా అవినీతి కేసులో పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులను
శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించే విధానాన్ని అమలు చేయాలి అని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
అవినీతి రంగంలో ఈ కఠిన చర్యలు అమలైతే మాత్రమే ప్రజలకు మంచి పరిపాలన అందుతుందని, ప్రతి అధికారి తన ఉద్యోగ ధర్మం పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారని తోట రాజయ్య స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి కోటగిరి సతీష్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు దుండ్ర కుమార్ యాదవ్, రాకేష్, జిల్లా నాయకులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి వేల్పుల మహేందర్, జిల్లా ప్రచార కార్యదర్శి శీలపాక నరేష్, ముక్తేశ్వర్, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

0 Comments