China's revolution in nuclear power A miracle with fusion-fission combination
ప్రపంచానికి నిరంతర విద్యుత్‌ను అందించే దిశగా చైనా విప్లవాత్మక అడుగు వేసింది.(China has taken a revolutionary step towards providing uninterrupted power to the world.) ప్రపంచంలోనే తొలిసారిగా కేంద్రక సంలీన (Fusion) మరియు విచ్ఛిత్తి (Fission) సూత్రాల కలయికతో ఓ వినూత్న అణు విద్యుత్ రియాక్టర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, సౌకర్యవంతమైన, అపారమైన విద్యుచ్ఛక్తి నిలకడగా అందుబాటులోకి రానుంది.
డేటా యుగానికి విద్యుత్ పునాది (Electricity is the foundation for the data age)
ఈ డేటా ఆధారిత కాలంలో విద్యుత్ అవసరాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, రోబోటిక్స్ వంటి రంగాల అభివృద్ధి కోసం అధికశక్తి అవసరం. ఓ పెద్ద AI డేటా సెంటర్ నిర్వహించాలంటే దాదాపు 40 లక్షల EV వాహనాలను చార్జ్ చేయడానికి సరిపడిన విద్యుత్ కావాలి! GPU లాంటి అధిక వినియోగ గల భాగాలకు నిరంతర విద్యుత్ ప్రవాహం తప్పనిసరి.
చైనా ముందస్తుగా పసిగట్టిన దారిలో (On the path that China foresaw in advance)
ఇప్పటికే అణు విద్యుత్ రంగంలో ప్రపంచాన్ని నడిపిస్తున్న చైనా, సంలీన-విచ్ఛిత్తి కలయికతో విద్యుత్‌ను మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమైతే, ప్రపంచ విద్యుత్ భద్రతకు గణనీయమైన మార్పు తెస్తుంది.
ఆవిష్కరణల దిశగా మారిన చైనా (China's shift towards innovation)
ఇంతకాలం ఇమిటేషన్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన చైనా, ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల్లోనూ అగ్రగామిగా మారుతోంది. హువావే, టెన్‌సెంట్, బీవైడీ వంటి సంస్థలు టెక్నాలజీలో చైనాను ముందుకు నడిపిస్తున్నాయి. బీవైడీ అభివృద్ధి చేసిన, ఐదు నిమిషాల్లో ఛార్జ్ చేసి 400 కిలోమీటర్లు ప్రయాణించగల బ్యాటరీ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. టెస్లాను తలపోయే స్థాయిలో విద్యుత్ వాహన మార్కెట్‌ను చేజిక్కించుకుంది.
ఝింగ్‌హువో రియాక్టర్: చైనా అణు విప్లవానికి నాంది (Jinghuo Reactor: The Beginning of China's Nuclear Revolution)
జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్ ద్వీపంలో ‘ఝింగ్‌హువో’ పేరిట ఈ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఉంది. చైనా భాషలో ‘ఝింగ్‌హువో’ అంటే మెరుపు. ఈ రియాక్టర్‌లో తొలి దశలో కేంద్రక సంలీన జరిపి, అందులోని శక్తితో విచ్ఛిత్తి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇలా కలయిక విధానంతో మరింత ఎక్కువ శక్తి ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.
అధిక శక్తి సామర్థ్యం: క్యూ వాల్యూ లక్ష్యం 30 (High energy efficiency: Q value target 30)
సంలీన ప్రక్రియలో శక్తి పొందిన శక్తి > వినియోగించిన శక్తి అయినప్పుడే దాన్ని “నికర శక్తి లాభం” అంటారు. దీనిని “క్యూ వాల్యూ”గా పిలుస్తారు. చైనా లక్ష్యంగా పెట్టుకున్న క్యూ వాల్యూ 30. పోల్చితే, అమెరికాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ITER ప్రాజెక్ట్ 10 క్యూ లక్ష్యంగా పనిచేస్తోంది.
చైనాకు భవిష్యత్ ఆధిపత్యం? (Future dominance for China?)
ఈ ప్రయోగం విజయవంతమైతే, విద్యుత్ రంగంలో చైనా మరింతగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది. 20 ఏళ్లకు సమానమైన పురోగతిని ఒక్కసారిగా అందుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
0 Comments