లంబాడి బంజారా నాయకులు
జనగామ:జనగామ జిల్లా కేంద్రంలోని జరిగే లంబాడి గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని జనగామ నియోజకవర్గ పరిధిలోని బంజారా లంబాడి నాయకులు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ హాస్పిటల్ నందు సన్నాహక సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లాలో రాష్ట్రంలో లంబాడి గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక ముఖ్యమైన సమస్యలు పరిష్కారం చేయాలని ముఖ్యంగా రాష్ట్రంలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో బంజారా భవన్ నిర్మాణానికి తక్షణమే ఒక ఎకరం స్థలం కేటాయించాలని, అదేవిధంగా సేవలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకొని అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న లంబాడి బంజారా ఉద్యోగస్తులందరికీ పూర్తిస్థాయి సెలవును కేటాయిస్తూ క్యాలెండర్ ఇయర్ లో చేర్చాలని డిమాండ్ చేశారు అనంతరం నూతనంగా సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది
నూతన ఉత్సవ కమిటీ
సేవాలాల్ జయంతి
ఉత్సవ కమిటీ చైర్మన్ గా
డా||లకావత్ లక్ష్మీ నారాయణ నాయక్
వైస్ చైర్మన్ గా అజ్మీర స్వామి నాయక్ , గౌరవ సలహా దారులుగా మూడ్ లక్ష్మణ్ నాయక్ ,గుగులోత్ లక్ష్మణ్ నాయక్ , కార్యదర్శిగా రెండో వార్డు మాజీ కౌన్సిలర్ వా0కుడోత్ అనిత, కోశాధికారిగా ధరావత్ శంకర్ నాయక్ యూత్ అధ్యక్షులుగా కొర్ర రాజేందర్ నాయక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా డాక్టర్ బాలాజీ నాయక్ లకావత్ నరేష్ నాయక్ ధరావత రమేష్ నాయక్ బానోత్ జితేందర్ నాయక్ భూక్యా కోట నాయక్ బానోత్ మహేందర్ నాయక్ బానోత హరిలాల్ నాయక్ ధర్మ బిక్షం నాయక్ ,నాగేందర్ నాయక్ దశ్రు నాయక్ నవీన్ నాయక్ శంకర్ నాయక్ , భూక్యా చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు
Celebrate the 286th birth anniversary of Sadhguru Sri Sri Sri Sant Sevalal Maharaj, the deity of the Lambadi tribes.
0 Comments