దేశంలోనే మొట్ట మొదటిసారిగా ... కన్యాకుమారిలో అద్దాల వంతెన..
👉 ఫైబర్ గ్లాస్ వంతెనను ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్...
👉 వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం రూ.37 కోట్లతో నిర్మించింది.
👉 దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు
అలంపూర్ ఆలయంలో విషాదం
🔹అలంపూర్లో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన మాణిక్య ప్రభు అతడి తల్లితో సోమవారం అలంపూర్ ఆలయాలను సందర్శించారు. రాత్రి ఆలయ సముదాయంలో నిద్రించగా గుండెపోటుతో అక్కడే చనిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన పూజారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం...
విశాఖ... గాజువాక....
ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాప్ లోకి దూసుకుపోయిన లారీ. వెంకట రమణ అనే వ్యక్తి మృతి. తృటిలో తప్పించుకున్నా మరో యువతీ.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ నాయకులను ఉరికించిన గిరిజనులు
తండాను సొంత గ్రామంలో విలీనానికి ఒప్పుకొని తండా వాసులు మా తండాలో మా రాజ్యం అంటూ నినదించిన తండా వాసులు వరంగల్ - చెన్నారావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేడు ఎమ్మెల్యే తన అధికార బలంతో సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి నేడు గ్రామసభ ఏర్పాటు చేయగా.. అధికారులు, కాంగ్రెస్ నాయకులను నిలదీసిన తండా ప్రజలు తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు మా తండా పైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని... మా తండాను ఎట్టి పరిస్థితిలో అమీనాబాద్ గ్రామంలో కలపకూడదని తిరుగుబాటు మా తండాను యధావిధిగా గ్రామపంచాయతీగా కొనసాగించాలని.. అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తండా వాసులు.
నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి చిరుత పులి కలకలం
దిలావర్‌పూర్ మండలంలో అర్ధరాత్రి 1:13 గంటలకు నిర్మల్ - భైంసా జాతీయ రహదారిపై కనిపించిన చిరుత పులి భయాందోళనలో స్థానికులు...
0 Comments