భారత్-చైనా (India-China) రక్షణ మంత్రులు, రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మరియు డోంగ్ జున్ (Dong Jun), త్వరలో భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ భేటీ గురించి ఉన్న సమాచారం ప్రకారం, ముఖ్యంగా సరిహద్దు మరియు ప్రాంతీయ స్థిరత్వం పై చర్చలు జరగనున్నాయి. ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశాలకు అనుబంధంగా, వచ్చే వారం వీరి సమావేశం జరగే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు తెలియజెయ్యాయి.
ఇటీవల నాలుగేళ్లుగా వాస్తవాధీన రేఖ (Line of Actual Control) దగ్గర జరుగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ, భారత్-చైనా మధ్య కీలక గస్తీ ఒప్పందం సాదించబడింది. ఈ ఒప్పందం ప్రకారం, 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ దగ్గర కొనసాగుతుందని రెండు దేశాలు అంగీకరించాయి. అలాగే, ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లవచ్చు అని ఈ ఒప్పందంలో పేర్కొనబడింది.
ఈ ఒప్పందంలో భాగంగా, రెండు దేశాల సైనికులు కీలక ప్రాంతాల నుండి తమ మౌలిక సదుపాయాలు, ఇతర సామగ్రిని తిరిగి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు ఇటీవల వెల్లడించాయి.
#India-China defense ministers to meet on patrolling agreement
#defenseministers
#patrolling agreement
0 Comments