తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం
ఈరోజు భారతీయ జనతా పార్టీ సూర్యాపేట(BJP suryapeta) జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో తుంగతుర్తి (thungathurthy)నియోజకవర్గ కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు హాజరై మాట్లాడుతూ
మోసపూరితపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాం
bjp suryapeta district |
గ్రెస్ పార్టీ నేడు హామీలు అమలు చేయడం లేదు..వర్షాకాలం మొదలైన రైతులకు పెట్టుబడి సాయం కొరకు ఇప్పటివరకు రైతుబంధు అందించలేదు...ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేషన్ కార్డును కుటుంబంగా పరిగణించి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమే... పాసుబుక్ ఆధారంగా రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి... కెసిఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి అవకాశం ఇచ్చారు... కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసం ??.. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఇప్పటివరకు గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేసిన పాపాన పోలేదు... రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాలను పొందలేకపోతున్నరు..6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ (bjp) పోరాడుతుంది... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(bjp) అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి నాయకులు అందరూ కృషి చేయాలి...
0 Comments