మరో నెల రోజులు జైలులోనే కవిత...
⛓️ 1 జూన్ 2024⛓️
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితపై ఆరోపణలు
మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ ఆయన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు...
బెయిలు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు
వచ్చే నెల (జూలై ) మొదటి వారంలోనే బెయిలు పిటిషన్‌పై తీర్పు!
నాగలిగిద్ద NGALIGIDDA: వర్షాకాలంలో రైతులు ఇబ్బందులు పడకుండా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ అధికారులు చూడాలని సామాజిక ఉద్యమకారులు ఎస్ గణపతి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారికి ఏవో వెంకటేశ్వర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్, గణపతి మాట్లాడుతూ. విత్తనాలను ఎరువులను షాపులలో కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి నకిలీ విత్తనాలను తెచ్చి అమ్ముతున్నారని ఈ విషయం ఏవో గారికి వివరించడం జరిగిందన్నారు. పేద రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులకు విత్తనాల పైన ఎరువుల పైన అవగాహన సదస్సు లాంటి ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులకు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!
![]() |
MUHURTHAM 2024 |
మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు. ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉన్నాయని పురోహితులు వివరించారు.
0 Comments