Do you know why Modi hasn't given presmeet till now?
Do you know why Modi hasn't given presmeet till now???
ఎవరైనా జర్నలిస్ట్ పుసుక్కున బయట ప్రచారంలో ఉన్న మూడింటిలో మీ నిజమైన పుట్టిన రోజు ఏది సర్ అని అడిగితే ఏమి సమాధానం చెప్పాలో అని భయం. మీరూ రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ లేదు కదా సర్ అంటే నిజం బయటపడుతుంది అని భయం.
మీరు చిన్నప్పుడు చెరువు నుండి మొసలిని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పారు కానీ మాజీ ఫారెస్ట్ ఆఫీసర్ మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అది అసత్యం అని చెప్పారు కదా అని అడుగుతారు అని భయం..
మీరు ఈమెయిల్ (E-mail) 1988 లోనే ఉపయోగించారు అని కానీ మన దేశంలో ఇంటర్నెట్ వచ్చింది 1995 లో మరి మీకు ఎలా సాధ్యం అయ్యింది అని అడుగుతారు అని భయం.
మీరు డిజిటల్ కెమెరా 1988 లోనే ఉపయోగించారు అని చెప్పారు కానీ ఇండియాలో డిజిటల్ కెమెరాలను(Digital Camera) అమ్మకాలు మొదలుపెట్టింది 1991లో కదా సర్ అని అడుగుతారు అని భయం.
మీరు 10th వ తరగతి ఎక్కడ చదువుకున్నారు?? మీతో పాటు చదువుకున్న మిత్రులు ఉన్నారా అని అడిగితే ఏమి సమాధానం చెప్పాలని భయం.
మీరు 1978 లో ఢిల్లీ యూనివర్సిటీలో (Delhi University) డిగ్రీ చేసినట్టు కంప్యూటరైజ్డ్ మర్క్స్ షీట్ చూపిస్తున్నారు బాగానే వుంది కానీ అప్పుడు దేశంలో ఏ యూనివర్సిటీలో కంప్యూటరైజ్డ్ సిస్టం లేదు కదా సర్ మీకు ఎలా సాధ్యం అయ్యింది అలాగే మొదటి సంవత్సరంలో నుండి మూడవ సంవత్సరం వరకు ఒకే పేరుతో డిగ్రీ మర్క్స్ మెమోలో పేరు ఒకేలా ఉంటుంది కానీ మీ పేరు ఎందుకు మారింది సర్ అని అడుగుతారు అని భయం.
బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం మీరు పోరాటం చేసి జైల్ కి కూడా పోయారు అని చెప్పారు కదా ఏ జైల్లో ఉన్నారు అని అడిగితే ఏమి సమాధానం చెప్పాలో భయం.
ఇలా ఇన్ని భయాలు ఉన్నోడు ఎలా ప్రెస్మిట్ పెడుతారండి మీరు మరీనూ.
0 Comments