సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ మునిగల రమేష్
![]() |
CPM Jangaon District |
కాగా ఈ వైఖరి సరైనది కాదు కలెక్టర్ గారికి విషయం చెప్పేది ఉంది ఒకసారి అడగమని మళ్లీ చెప్పగా ఒకరినే రమ్మంటాడు సారు అని అతను చెప్పడం జరిగిందన్నారు చాంబర్లోకి సిపిఎం జిల్లా కార్యదర్శి వెళ్ళగానే కలెక్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చావు కంట్రోల్ రూమ్ లో ఫిర్యాదు చేయాలి అని తెలవదా మీ పార్టీనుండి ఎన్నికల సమావేశాలకు వచ్చేటోడు ఎవడు వాడు వాడికి తెలువదా అంటూ అమర్యాదగా దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ నియోజకవర్గ ఎన్నికల సమావేశము గూర్చి 48 గంటలకు ముందే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది ఈ విషయంపై సువిధ లో అప్లై చేసుకునేందుకు వెళ్లగా ఓపెన్ కావట్లేదు అని ఆన్లైన్ సెంటర్లో చెప్పారు. ఈ విషయంపై ఆర్డీవో కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా ఓపెన్ కావట్లేదని మేము ఏమి చేయలేమని అన్నారు.
ఈ విషయంపై క్లారిటీ కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే మేము చెప్పే విషయాలు వినకుండా ఇక్కడికి రావద్దు అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కలెక్టర్ అహంకారపూరిత వైఖరి వలన ఎన్నికలు ఎలా సజావుగా నిర్వహిస్తారని ఏవైనా ఎన్నికలకు సంబంధించిన సమస్యలు ఉంటే జిల్లా రిటర్నింగ్ అధికారి గారికి ఫిర్యాదు ఎలా చేయాలని అన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగాలంటే దురుసుతనం ఉన్న జిల్లా కలెక్టర్ ను ఎన్నికల విధులను తప్పించి జనగామ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చూడాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాజకీయ పార్టీ ఎన్నికలే అని రాజకీయ పార్టీ నాయకులకు ప్రజలకు సమయం ఇవ్వకుండా వారి యొక్క అనుమానాలను సందేహాలను నివృత్తి చేయకుండా ఎన్నికలు ఏ విధంగా సజావుగా సాగుతాయని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ పై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం బచ్చనపేట మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొడపాక యాకయ్య పాలకుర్తి మండల కార్యదర్శి మాచర్ల సారయ్య జిల్లా కమిటీ చిట్యాల సోమన్న సోమసత్యం బచ్చన్నపెట మండల కమిటీ సభ్యులు రామగళ్ల అశోక్ బైరగోని బాల రాములు నాయకులు పర్వతం నరసింహులు కుమార్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు
0 Comments