హైదరాబాద్: నగర ప్రయాణికుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ప్రారంభించడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాటిని ప్రారంభించనున్నారు. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వస్తున్న బస్సులని గ్రేటర్ అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో కూడా మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. నగరంలోని అన్ని ప్రాంతాలకు నడుస్తాయి. బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్‌సీయూ, రాణిగంజ్ డిపోల్లో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సులు సమకూర్చుకుంటోంది. ఇందులో 125 మెట్రో డీలక్స్‌లుంటాయి. ఇవన్నీ జూన్‌లో అందుబాటులోకి వస్తాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులు. ఈ బస్సులన్నిటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది.....
0 Comments