రైల్వే స్టేషన్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిరసన ర్యాలీకలెక్టరేట్ ఎదుట మహా ధర్నా
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయకుంటే మోడీ ని గద్దేదించుదాం
~~~~~~
జనగామ: జాతీయ కార్మిక సంఘాలు సంయుక్తా కిషన్ మోర్చా జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ జనగామ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో స్థానిక రైల్వే స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు రెండు కిలోమీటర్లు వందలాది మంది కార్మికులు కర్షకులు CITU BRTU INTUC AIKS JADU AIAWU వివిధ కార్మిక సంఘాలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో *కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ కలెక్టరేట్ ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన సభ సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ అధ్యక్షత వహించగా*CITU జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం కనకా రెడ్డి బిఆర్టియు జిల్లా అధ్యక్షులు వేముల నర్సింగం ఐ ఎన్ టి యు సి ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి జనగామ జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జేరిపోతుల కుమార్ లు మాట్లాడుతూ
కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కనీస వేతనం కార్మికులకు నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు 2022 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అన్నారు ధరల పెరుగుదలను అరికట్టాలని ఆహార వస్తువులు నిత్యవసర సరుకుల ధరలపై జిఎస్టిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టం చేయాలన్నారు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై దౌర్జన్యం ఆపాలని హెచ్చరించారు కేంద్ర బిజెపి కార్పొరేట్ మతోన్మాద విధానాలపై కార్మికులు కర్షకులు తిరగబడతారని ధ్వజమెత్తారు మూడోసారి అధికారంలోకి రావాలని కలలుగంటున్న బిజెపిని శంకరగిరి మాన్యాలకు ప్రజలు పంపుతారని అన్నారు ఇప్పటికైనా బిజెపి కార్మిక కర్షక ప్రజా అనుకూల విధానాలు అనుసరించాలని ఎన్నికల్లో గతంలో ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు కార్మిక కర్షక ప్రజా డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ఉద్యమం బీజేపీని గద్దె దించే వరకు కొనసాగుతుందని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో సిఐటియు బిఆర్టియు ఐ ఎన్ టి యు సి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మున్సిపల్ గ్రామపంచాయతీ ఆటో లారీ బస్సు పసుమిత్ర మధ్యాహ్న భోజన కార్మికులు అల్యూమినియం వర్కర్స్ అమాలి పవన నిర్మాణ కార్మిక టైలర్ వివిధ రంగాల చెందిన యూనియన్ల నాయకులు ప్రజాసంఘాల నాయకులు సుంచు విజేందర్ జోగు ప్రకాష్ పి ఉపేందర్ బొట్ల శేఖర్ ఇర్రి ఆహాల్య పి లలిత మీట్య నాయక్ శంకరయ్య దేవదానం గంగాపురం మహేందర్ మంగ బీరయ్య జి మాధవి తిప్పారపు ప్రసాద్ గంధమాల మల్లేష్ వెంకటస్వామి మంగా నజియా బేగం ఆదిలక్ష్మి జై బున్నిసా బూడిద ప్రశాంత్ నా రోజు రామచంద్రము ఏ రాజు బ్లెస్సింగ్ టన్ మడి కంటి రాజు సతీష్ ఆ రిప్ నరేష్ రాగల్ల అంజయ్య కచ్చగల వెంకటేష్ మున్నీర్ బోట్ల వెంకటేష్ శ్రీనివాస్ బోట్ల నాగరాజు మసి రాజు తదితరులు పాల్గొన్నారు
0 Comments