జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెస్ ఛార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కలక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం జనగామ : తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కాలంగా వసతి గృహాలు, గురుకులాలు, కెజిబివిలు ,ఆశ్రమ పాఠశాలు సంబంధించిన మెస్ బిల్లులు సమారు 6,300 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు... ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..... విద్యారంగ సమస్యలు పరిష్కారం చూపాలని గత ప్రభుత్వంకు అనేక సందర్భాల్లో నిధులు విడుదల చేయాలని కోరిన ఫలితం లేకుండా పోయింది. అలాగే గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు కూడా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. వార్డెన్లు అప్పులు తీసుకుని వచ్చి హస్టల్స్ నడుపుతున్నారు. దీనివల్ల పేద విద్యార్థులు చదువుకుంటున్న వసతిగృహాలకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించడం లేదు. అలాగే గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్రంలో 7200కోట్ల స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల కాలేదు. అనేక సార్లు ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
14 లక్షల మంది విద్యార్థులు తమ ఫీజులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూoనాము అద్దె భవనాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు స్వంత భవనాలు నిర్మించాలి.. *బాసర, ఉమెన్ యూనివర్శీటీ, వ్యవసాయ యూనివర్శీటీలకు వి.సి.లను నియమించాలి ప్రభుత్వం రాష్ట్ర యూనివర్శీటీలకు నూతన వైస్ - ఛాన్సలర్స్ నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లో రాష్ట్రంలో ప్రధానమైన యూనివర్శీటీలు. అయిన బాసర ఐఐఐటి ,ప్రతిష్టాత్మకంగా ఎర్పాటు చేసిన మహిళా యూనివర్శీటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయంనకు నోటిఫికేషన్లో నియమకాలపై స్పష్టత లేదు. బాసర విద్యార్థులు తమ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రెగ్యూలర్ వి.సి. కావాలని ఆందోళనలు చేశారు, ఉమెన్ యూనివర్శీటీ బోర్డు తప్ప అతిగతి లేదు
0 Comments