జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో వీరనారి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ సభ స్థానిక నాయకులు అక్కెనపల్లి అంజయ్య అధ్యక్షతన సభ జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య హాజరయ్యారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలమ్మ పోరాట చరిత్ర నేటి యువతకు మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అట్టడుగు వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని హక్కులసాధన కోసం పోరాడాలని పిలుపునిచారు. వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐలమ్మ జీవిత చరిత్ర పాఠ్యాంశాలు చేర్చాలని, వృత్తిదారులకు రుణాలు ఉపాధి సంక్షేమ చర్యలకు తగిన విధంగా ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి చల్లా ఉమా సుందీర్ రెడ్డి, జనగామ జిల్లా రజకవృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మైలారం వెంకటేశ్వర్లు,ఏదునురు మదర్, వరంగల్ జిల్లా నాయకులు అక్కెనపల్లి యాదగిరి, మండల Zptc, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments