********
జనగామ : వీరనారి ఐలమ్మ నగర్ మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు ప్లాట్ కలిగి ఇల్లు కట్టుకొని కబ్జాలో ఉన్న ప్రతి ఒక్కరికి మున్సిపల్ ద్వారా మోటివేషన్ చేసి ఇంటి నెంబర్లు ఇవ్వాలి గృహలక్ష్మి ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మిషన్ భగీరథ వాటర్ పైపులు లైన్ ద్వారా మంచినీళ్లు ఇవ్వాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శనివారం జనగామ సిపిఎం పార్టీ ఆఫీసులో మూడో విడత లబ్ధిదారల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి కమిటీ అధ్యక్షులు కళ్యాణం లింగం అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా జోగు ప్రకాష్ సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ మూడో విడత ఇందిరమ్మ లబ్బిదారులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం2012-2013 వ సంవత్సరంలో ఇచ్చిన ఇందిరమ్మ పట్టా లబ్ధిదారులకు 5 లక్షల రుణం గృహలక్ష్మి ద్వారా ప్రత్యేక అవకాశం కల్పించి ఇవ్వాలని అన్నారు అలాగే అక్కడ ఉంటున్న ప్రజలకు మౌలిక వసతులు మంచినీరు కరెంటు సీసీ రోడ్డు వెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఉపాధ్యక్షులు దామెర అబ్రహం ముష్పట్ల జయ లింకన్ భవాని కర్ణ గుండు శశిరేఖ బాలమణి కమల సౌందర్య నాగమణి ఆనంద్ కౌర్ గంగా కౌర్ కచ్చ గళ్ళ వెంకటేశు భూనాద్రి వెంకటేష్ సుధాకర్ బాలస్వామి గూడెపు మహేశ్వరి కుడుదల అంజమ్మ పాల్వాయి పద్మ తదితరులు పాల్గొన్నారు .
0 Comments