ఈనెల 12,13 తేదీలలో లింగాల గణపురం మండల కేంద్రంలో జరిగే
సి.పి.యం. మండల స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు జయప్రదం చేయండి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు
లింగాల గణపురం: దేశంలో, రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలే ఊపిరిగా ప్రజా సమస్యల పరిష్కారంకై అనునిత్యం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న ప్రజా పోరాటాల రథసారథి సి.పి.యం. పార్టీ లింగాలఘణపురం మండలస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఈ నెల 12, 13 తేదీలలో మండల కేంద్రంలోనిర్వహిస్తున్నాము. ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సి.పి.యం. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు కోరారు
సి.పి.యం. *లింగాల గణపురం మండల కమిటీ సమావేశం మండల కేంద్రంలో గోసంగి శంకరయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో సిపిఎం పార్టీ సూత్రబద్ధమైన రాజకీయ వైఖరితో పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేపడుతుంది. అన్నారు పాలకవర్గాల తప్పుడు విధానాలను ప్రజలలో ఎండగడుతు. దేశంలో బి.జె.పి. అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించాలని పోరాడుతున్నామని తెలిపారు . పెరిగిన ధరలను నియంత్రించాలని సామాన్యులకు అందుబాటులో నిత్యవసర సరుకుల ధరలు ఉండేల చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . రైతు, కార్మిక ఉద్యోగ, మహిళలు, కూలీలు, విద్యార్థులు, యువజనులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వృత్తిదారుల హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు లింగాలఘణపురం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం సి.పి.యం. పార్టీ ఉద్యమాలు నిర్వహించింది. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా ఇండ్లు, ఇండ్ల స్థలాలకోసం ప్రభుత్వం ఇస్తుందేమో అని ఎదురు చూసి విసుగుచెందిన పేదలను సమీకరించి మండలంలోని నెల్లుట్ల- పటేల్గూడెం ప్రభుత్వ అసైన్డ్ భూమిలో వేలాది గుడిసెలు వేయించడం జరిగింది. కళ్ళెం డబుల్బెడ్రూం ఇండ్లల్లో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని పోరాటం నడుపుతుంది. రియలెస్టేట్ దారులు మండలంలో రైతుల భూములు ఆక్రమించుకుంటే సి.పి.యం. ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించి కళ్ళెం గ్రామంలో రైతులకు తిరిగి ఇప్పించడం జరిగింది. దేవాదుల ప్రాజెక్ట్ కెనాల్ కాలువ క్రింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని పోరాడి నష్ట పరిహారం ఇప్పించడం జరిగింది. జీడికల్ నుండి జనగామ వరకు డబుల్ రోడ్డు వేయాలని జీడికల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. కళ్ళెం కో-ఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సి.పి.యం. రైతుసంఘం ఆధ్వర్యంలో పోరాటం నడిపి. సుమారు 44 లక్షల అవినీతిని బయటం పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో నెలకొన్న స్థానిక సమస్యలు అంతర్గత రోడ్లు మరమ్మతులు చేపట్టాలని, డ్రైనేజీ, పారిశుద్యం, వీధిలైట్లు, పెన్షన్లు, రేషన్కార్డులు, తదితర సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు నిర్వహించడం జరిగింది.
లింగాలఘణపురం మండలంలో సి.పి.యం. పార్టీ సారథ్యంలో నాటి నుండి నేటివరకు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలిచిన పార్టీ సి.పి.యం. కుందారం, సిరిపురం, కళ్ళెం అనేక గ్రామాల్లో భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతి సాగుభూమి లేని పేదలకు భూములు పంచిన ఘనత సి.పి.యం. పార్టీదే. భవిష్యత్తులో సి.పి.యం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చే సేందుకు మండల పార్టీ సభ్యుల సైద్దాంతిక రాజకీయ అవగాహన పెంపొందించేందుకు జరిగే మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను అన్నివర్గాల ప్రజలు సహకరించి జయప్రదం చేయాలని కోరుచున్నాము. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల బాధ్యులు*తూటీ దేవదానం మండల కమిటీ సభ్యులు రాపోలుసమ్మయ్య, మబ్బు ఉప్పలయ్య, చెన్నూరు ఉప్పలయ్య గైని భిక్షం గౌడ్, చింత ఎల్లయ్య, తాళ్ళపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు
0 Comments