తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో 3000 గ్రామాల్లో భూస్వాములను తరిమి కొట్టి సుమారు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఎర్రజెండాకు ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న. మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని జీడి సోమ నరసయ్య స్మారక స్థూపం వద్ద వారి కుటుంబ సభ్యులతో కలిసి సిపిఎం జెండాను ఆవిష్కరించి అనంతరం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిధ పోరాటంలో సుమారు 4000 మంది ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో భూస్వాములు అన్ని రకాల కులస్తులతో వెట్టి చాకిరి చేయించుకున్నారన్నారు.ఈ క్రమంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ఎర్రజెండా ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు పోరాటం చేశారని తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచ స్థాయి పోరాటాల్లో ఒకటిగా గుర్తింపు వచ్చింది అని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల పోరాటంగా వక్రీకరించేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. షేక్ బంధంగి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేశారని గుర్తు చేశారు. మతాలకతీతంగా భూమికోసం వెతి చాకిరి విముక్తి కోసం నైజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాటాలు చేశారని. ఏదైనా పోరాటం చేసింది చరిత్ర బీజేపీ ఉన్నదా అని ప్రశ్నించారు. సాయుధ పోరాట త్యాగాన్ని వారి అమరత్వాన్ని ఈనాటి యువతకు తెలియజేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సోమసత్యం, నాయకులు తోటరాజు, సోమ నరసయ్య కుటుంబ సభ్యులు జీడి రవీందర్, జీడి సోమేశ్వర్, జీడి హరీష్, జీడి శివాజీ, ముద్దర బోయిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు
మరిన్ని వార్తలు :
శ్రీలంకతో జరిగిన 3వ వన్డేలో పాకిస్థాన్ 3-0తో వైట్‌వాష్‌ను కైవసం చేసుకుంది.
శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ కుడి స్నాయువు గాయంతో బాధపడ్డాడు
₹538 కోట్ల రుణం మోసం కేసు: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు ఆర్థర్ రోడ్ జైలు శిక్ష
0 Comments