OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఘన నివాళులు; లచ్చు నాయ క్ ఆశయాలను సాధించుకుంటాము.

PCC Member డాక్టర్ జాటోత్  రామచంద్రనాయక్, డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని పెద్దనాగారం శివారు వాంకడోతు తండాకు  చెందిన లచ్చు నాయక్ రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి భౌతిక దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన PCC Member డాక్టర్  జాటోత్ రామచంద్రనాయక్ గారు,

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించి ,పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన కార్యకర్త, నాయకుడు లచ్చు నాయక్ అని వారు కొనియాడినారు.  లచ్చూ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చి  ధైర్యాన్ని కల్పించారు.లచ్చు నాయక్  మరణము దురదృష్టవశాత్తు ప్రమాదం  జరగడం ఊహించుకోలేని,  అనుకోలేని  సంఘటన జరిగిందని రామచంద్రనాయక్ విచారము  వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు నాయక్, రఘువీరారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్, సీనియర్ నాయకులు పల్లెల శ్రీనివాసరావు ,పిఎసిఎస్ డైరెక్టర్ రజినీకాంత్ రెడ్డి, పెద్ద నాగారం స్టేజి  సర్పంచ్ బొబ్బ సోమిరెడ్డి ఉప సర్పంచ్ అనీల్ ,రాజేందర్ నాయక్, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ సెల్ మండల అధ్యక్షులు దస్రు నాయక్, మధు, గుండ గాని వెంకన్న గౌడ్, అలాగే యూత్ అధ్యక్షులు చిర్ర సతీష్ గౌడ్ వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు రమేష్ నాయక్ ,రామకృష్ణ, మహబూబ్ ఖాన్, సురేష్ గౌడ్, వెంకన్న ,మధుకర్, సురేష్ మరియు యూత్ నాయకులు చల్లమల్ల నరేష్ ,అనిల్ నాయక్, వీరన్న ,లింగన్న ,పొన్నం శ్రీకాంత్, ఉపేందర్ గౌడ్, రమేష్ ,కిసాన్ సెల్ నాయకులు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments