OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

Telangana News 13-03-2023 Our society tv

 గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని   కలెక్టరేట్ ముందు ధర్నా 
వినూత్న నిరసన వంటావార్పు

తక్షణమే వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతాం

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి  రాజు

జనగామ : గ్రామపచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్( సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించి వంటా వార్పుతో కలెక్టరేట్ ముందు సహపంక్తి భోజనాలు చేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి  రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఆరు నెలలుగా వేతనాలు లేకుండా పస్తులతో పనిచేస్తున్న పరిస్థితి దాపురించిందని తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు దిగుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో కామారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ సిబ్బంది కొంగరి బాబు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడంటే గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు మా పంచాయతీ సిబ్బంది ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు మరణించి  కొంగరి బాబు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామపంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు ఉద్యోగ భద్రత పర్మినెంట్ తదితర డిమాండ్ల సాధన కోసం గ్రామపంచాయతీ సిబ్బంది సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు



 ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ &వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తిని వెంకన్న నారోజు రామచంద్రం సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజయేందర్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు మల్లాచారి ,బసవ రామచంద్రు రామ్ నారాయణ గుర్రం లాజర్ బోస్ రాజు తిప్పారపు యాకూబ్ జగన్ కుంభం రాజు బాలనర్సయ్య, సత్యనారాయణ రమేష్ వెంకట్ రెడ్డి ఐలయ్య వెంకటరమణ శ్యామ్ గంగరబోయిన మల్లేష్ రాజ్ సుదర్శన్ వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

28వ రోజుకు చేరిన మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల రిలే నిరాహార దీక్షలు

పట్టా ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి

పార్నంది మల్లమ్మ
మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల సాధన కమిటీ సహాయ కార్యదర్శి
గత 25 వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు  మూడో విడత లబ్ధిదారులు నిరసన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే గారు జరిపేదలను చూడండి ఓటేసేది ఈ పేదవాళ్లే కదా కాబట్టి వారిని పట్టించుకోండి మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల పోరాట సంఘం సహాయ కార్యదర్శి పార్నంది మల్లమ్మ అన్నారు. శనివారం రోజున చిట్యాల ఐలమ్మ నగర్ డబల్ బెడ్ రూమ్ ల వద్ద మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంఘం సహాయ కార్యదర్శి కానంది మల్లమ్మ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012 -13 సంవత్సరంలో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా పట్టాలిచ్చి స్థలాలు చూపించడం మరిచారని నేటి తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన వాళ్లకు 6 నెలల్లోడబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ ఐదు సంవత్సరాలు కావస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం పేదల పట్ల జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి చిత్తశుద్ధి లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని ఇదే సందర్భంలో సర్వే చేయడం మోసం చేయడమే  అన్నారు. ఇప్పటికైనా జిల్లా స్థానిక ఎమ్మెల్యే  వెంటనే మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ ఉపాధ్యక్షులు ఎండి గౌసియా ఎర్ర రజిత ఎండి నాజియా భాగ్య లక్ష్మి  తిమోతి మోడీ రాములు తదితరులు పాల్గొన్నారు.

 ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్ర పూజలు: ఇద్దరి అరెస్ట్

వరంగల్ : మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని  అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు  మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హనమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.  వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏం. ఏ బారి, సెంట్రల్ జోన్ డీ సి పి గారు  ఈ మేరకు వివరాలు తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్  ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆసుపత్రి ప్రారంబించి, ఆసుపత్రి ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు. *

టాస్క్ ఫోర్స్ పోలీసులకి వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఏం. జితేందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ , ఏ సి పి గారి ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు మరియు వైద్యశాఖ సిబ్బంది తో  ఫారహీన ఆసుపత్రి పై ఈ రోజు 13.03.2023 ఉదయం దాడులు చేసి,  ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్రపూజలు చేసి  చేతబడి చేసినవారికి తగ్గిస్తామని , సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేస్తామని, ఆరోగ్య, ఉద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులతో పాటు దూర ప్రాంతాల ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చే పేదలను మోసం చేస్తున్న సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47)  అదుపులోకి తీసుకొని విచారించారు. 

పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు :

వీరు  ఎక్కవగా     పౌర్ణమి,  అమావాస్య  లలో క్షుద్రపూజాలు చేసి, తన దగ్గరికి వచ్చిన వారికి వారి యొక్క రోగాలను నయం చేసే  నెపం తో క్షుద్రపూజాలు చేసి, వారిని నమ్మించి అదిక మొత్తం లో డబ్బులు వసూలు చేశారు.  సయ్యద్ ఖాదిర్ అహ్మెద్ గతంలో కరీంనగర్ లోని ఒక డాక్టర్ వద్ద సహాయకునిగా కొంత కాలం పనిచేసి అక్కడ వైద్యం ఏ విధంగా చేయాలో నేర్చుకొని , తన తండ్రి ఖరిముళ్ల ఖాద్రి గతంలో పూజలు చేసి  తాయత్తులు కట్టేవాడు. ఈ అనుబావం తో అతను హనమకొండ లోని నయీంనగర్ లోని కె యు సి క్రాస్ రోడ్డు వద్ద గత 35 సం.. ల నుండి తన స్వంత భవనం లో ఫారహీన  క్లినిక్ పేరిట నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతి మరియు ల్యాబూ పత్రాలు లేకుండా  ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకొని తన వద్దకు వచ్చిన రోగులకు వారి పై గిట్టని వారు చేతబడులు చేశారని, దయ్యం పట్టినధి అని, నర దృష్టి ఉంది  అని, మీలో దోషాలు ఉండడం వల్ల సంతనాలు కలుగడం లేదని , ఉద్యోగాలు రావడం లేదని , కుటుంబ తగాదాలు పరిష్కారం కోసం వారికి లేని పోనీ భయలును కలిగించి క్షుద్రపూజాలు చేసి వాటిని పరిష్కరిస్తానని ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు.  కొంతమంది దీర్గ  కాలం గాట్రీట్మెంట్ ఇస్తూ డబ్బులు దోచుకోవడం చేస్తున్నాడు. కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటానికి వారికి ఆలోపతి మందులు మంత్రించి ఇస్తున్నట్లు ఇచ్చి అవి వాడిన తరువాత రోగం నయం అయితే క్షుద్రపూజాలు  వలనే చేయడం వల్లనే తగ్గినధి అని    నమ్మిస్తున్నారు.  ఇతను హన్మకొండ లోనే కాకుండా హైదరాబాద్ లో మరియు కొంత మంది రోగుల స్థితి ని బట్టి వారి యొక్క స్వస్థలకి వెళ్ళి క్షుద్రపూజాలు నిర్వహిష్టడు. ఇతనికి ఇట్టి క్షుద్రపూజాలు కు సహాయకులు గా ఉన్న  సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (46) తండ్రి పేరు నూర్ నివాసం ఉప్పల్, హైదరాబాద్ అదుపులోకి తీసుకొనినది. ఇట్టి క్షుద్రపూజలకి సహకరించిన యాకూబ్ బాబా  మరియు అతని భార్య సమరీన్, ఏం. డీ ఇమ్రాన్ వారు పరారీలో ఉన్నారు. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ తండ్రి పేరు ఖరిముళ్ల ఖాద్రి, 53 సం.. లు, ముస్లిం, ఫేక్ డాక్టర్ నివాసం 5-11-509, నియర్ కె యు సి, నయీంనగర్.  పై గతం లో గుప్తా నిదుల తవ్వకం పై ములుగు ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో  క్రైమ్. నెంబర్ 30/2017 U/s 447,427,420 r/w 34 IPC , 20 ITTA Ac t.    ]

వీరి వద్ద నుంచి పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. క్షుద్రపూజల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్ తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డిసిపి హెచ్చరించారు.

అరెస్ట్ అయిన వారు : 02

1. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ తండ్రి పేరు ఖరిముళ్ల ఖాద్రి, 53 సం.. లు, ముస్లిం, ఫేక్ డాక్టర్ నివాసం 

 5-11-509, నియర్ కె యు సి,

2. సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47)  నివాసం హబ్సిగూడ హైదరాబాద్ 

పరారీ లో ఉన్నవారు : 03

1.యాకూబ్ బాబా  మరియు అతని 2.భార్య సమరీన్, 3.ఏం. డీ ఇమ్రాన్

స్వాదిన పరుచుకున్న వస్తువులు: 

   1.  ఆలోపతి మందులు 

2.  క్షుద్రపూజ సామగ్రి-2. 

3. ల్యాబ్ టెస్ట్ సామగ్రి. 

4. చరవాణి-01  

5. తవేర  వాహనం. 01 

6. పేషెంట్ రిజిస్టర్ : 01  మరియు కరపత్రం 

7. నగదు: 3,00,000/-

     వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్ ఏ సి పి ఏం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావ్, ఎస్సై లు నిస్సార్ పాషా, లవన్ కుమార్, ఏ ఏ వో సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతా మరియు కానిస్టేబుల్ బిక్షపతి, రాజేష్, రాజు, శ్రీనివాస్, శ్రావణ కుమార్, నాగరాజు, నవీన్  లను ఆబినందిచారు

నిధుల మంజూరులో ముడుపులు తీసుకున్నా రన్న ఆరోపణల నేపథ్యంలో ఐదుగురు భారాస ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వేటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని అమలు చేస్తున్న దళితబంధు, కల్యాణలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరులో ముడుపులు తీసుకున్నా రన్న ఆరోపణల నేపథ్యంలో ఐదుగురు భారాస ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వేటు- వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు- తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు ఎదుర్కొంటు-న్న ఈ ఐదుగురు శాసన సభ్యులకు పార్టీ టికెట్లను నిరాకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయని భారాస వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ ఇటీ-వల ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో తనకు అత్యంత సన్నిహితులైన సీనియర్‌ నేతలతో చర్చల సందర్భంగా చెప్పినట్టు- విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు, ఆదిలా బాద్‌ జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ముగ్గురు భారాస ఎమ్మెల్యేలు దళితబంధు, కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుని వాటిని మంజూరు చేయించినట్టు- సీఎంవోకు ఫిర్యాదులు అందాయని సమాచారం.

ముడుపులు తీసుకున్న ఎమ్మెల్యేలను ఇటీ-వల హైదరాబాద్‌కు పిలిపించిన సీఎం కేసీఆర్‌ వారిపై ఒక రేంజ్‌లో తలంటు-పోసినట్టు- చెబుతున్నారు. రెక్కాడినా డొక్కాడని పరిస్థితుల్లో గ్రామీణ ప్రాం తాల్లో దళితులున్నారని, వారి అభ్యున్నతికి దళితబంధు ప్రారంభిస్తే అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది పోయి కక్కుర్తిపడితే ఎలా అని కేసీఆర్‌ వారిని నిలదీసినట్టు- భారాసలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ఆయా అసెంబ్లీ నియోజక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు దళితబంధు, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వం కట్టబెట్టింది. దీన్ని అదనుగా తీసుకుని అక్కడక్కడ ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం కొన్ని తప్పిదాలకు పాల్పడినట్టు- ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి.
కొన్ని నియోజక వర్గాల్లో ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక మొదలు నిధుల మంజూరు వరకు నిబంధనలకు తిలోదకాలిచ్చారని ఇందులో కొందరు అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్టు- ప్రభుత్వం గుర్తించినట్టు- తెలుస్తోంది. ఈ పథకాల అమల్లో జరిగిన పొరపాట్లకు సంబంధించి కొందరు పార్టీ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు పిలిపించి హెచ్చరించిన సమయంలో కేసీఆర్‌ కొన్ని ఘా-టైన వ్యాఖ్యలు కూడా చేశారని, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తనకు పూర్తి సమాచారం ఉందన్న విషయం కూడా అన్నారని చెబుతున్నారు. దళితబంధు అమలు ఎలా జరిగిందో తన దగ్గర వివరాలు ఉన్నాయని వారితో అన్నట్టు- సమాచారం. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు మూడు రోజుల క్రితం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్‌ దళితబంధు, కల్యాణలక్ష్మి పథకాల అమల్లో దుర్వినియోగం జరిగిన విషయం వెల్లడిస్తూ ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తప్పులు జరిగాయని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల నుంచి ముడుపులు తీసుకున్నారన్న పక్కా సమాచారం తన దగ్గర ఉందని ముఖ్యమంత్రి చెప్పడంతో సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఖంగుతి న్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని ఒక సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు. దళిత వర్గాల అభ్యున్నతికి దళిత బంధు పథకం కింద స్వయం ఉపాధి కోసం ఎటు-వంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంటే దాంట్లో కూడా ముడుపులు తీసుకోవడం ఏంటని కేసీఆర్‌ నిలదీసినట్టు- తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించి ముడుపులు చేతులు మారుతు న్నాయన్న పక్కా సమాచారం అందడంతో స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగి వేగుల ద్వారా సమాచారాన్ని సేకరించినట్టు- సమా చారం. ఈ తరహా విధానం పునరావృతమైతే ఉపేక్షించమని కూడా కేసీఆర్‌ ప్రగతిభవన్‌ సమావేశంలోనే ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు. అసెంబ్లీ ఎన్నికల్లో 99శాతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే తిరిగి ఎంపిక చేస్తానన్న కేసీఆర్‌ దళితబంధు అమల్లో అవినీతికి పాల్పడిన వారికి మాత్రం పోటీ-చేసే అవకాశం ఉండవన్న సంకేతాలివ్వడంతో ఆరోపణలు ఎదుర్కొంటు-న్న ఎమ్మెల్యేలు మరో దారి చూసుకునే పనిలో ఉన్నట్టు- ప్రచారం జరుగుతోంది.
మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్  టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్
ఈ రోజు మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్  టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన గారు గద్వాల్ పట్టణంలోని MALD కాలేజి పొలింగ్ కేంద్రం ను సందర్శించి పొలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి పోలీస్ భద్రతను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు...

ఈనెల 15న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని సంజయ్ కు నోటీస్ లు.

బండి సంజయ్ ఎమ్మెల్సీ కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళ కమిషన్.
డీజీపీ ని వ్యక్తిగత విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించిన చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఈనెల 15న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు నోటీస్ లు.

పెద్దపల్లి నియోజకవర్గం

శ్రీ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు
శాసనమండలి సభ్యురాలు శ్రీ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి కవితక్క గారి జన్మదిన  వేడుకల కార్యక్రమం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ... కవిత గారు ఉద్యమ నాయకురాలని,  తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అని,  ఈ బతుకమ్మ పండుగకు దేశ విదేశాల్లో ఒక అంబాసిడర్ గా వ్యవహరించి ఎంతో ప్రాచుర్యం కల్పించడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి కవిత గారని తెలిపారు.వారి ఉద్యమ నేపథ్యమైతే నేమి, మనబతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో ప్రాచుర్యం కల్పించిన తీరైతే నేమి, వారు తెలంగాణ  బిడ్డలకు ఒక ఐకాన్ లా మారారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిపై బీజేపీ నాయకులు అబండాలు వేస్తూ తప్పుడు మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. ఇటువంటి మాటలు తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ సమాజానికి శోభనీయం కాదన్నారు. కవిత గారి ని కించపరుస్తూ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నానని,ఇటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వశ్రీరాంపూర్ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి,ఎంపీపీ నూనేటి సంపత్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ లైసెట్టి బిక్షపతి , BRS నాయకులు పైడ రవి కుమార్, పెంచాల శ్రీధర్,సుంకం మల్లారెడ్డి, ఈర్ల శ్రీనివాస్,కూకట్ల నవీన్,వాసు, కళ్యాణ్, మధు, సంపత్, రంగయ్య, తక్దీర్,కరుణాకర్, కన్నం రమేష్, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments