OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

Pullareddy Sweets family dispute is harassing Daughter-in-law Pragya Reddy

 తనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన 'పుల్లారెడ్డి స్వీట్స్' యజమాని కోడలు



మరోసారి తెరపైకి పుల్లారెడ్డి స్వీట్స్ కుటుంబ వివాదం తనను వేధిస్తున్నారన్న కోడలు ప్రజ్ఞారెడ్డి

తనను, తన కుమార్తెను చంపేందుకు యత్నించారని వెల్లడి*

పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ఆ ఇంటికోడలు ప్రజ్ఞారెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డి  గత రెండేళ్లుగా తనను, తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞారెడ్డి ఆరోపించారు. వారు గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను గదిలోంచి బయటికి రానివ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారని వివరించారు. కోర్టు స్పందించి, ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని ప్రజ్ఞారెడ్డి వివరించారు. అంతేకాదు, వారు తనను, తన కుమార్తెను చంపేందుకు ప్రయత్నించారని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తన అత్త భారతిరెడ్డిపై హైదరాబాదులో భూకబ్జా కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను... నాకు, నా బిడ్డకు న్యాయం చేయండి అంటూ ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. 

పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి.పుల్లారెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు జి.రాఘవరెడ్డి పుల్లారెడ్డి గ్రూప్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆయన కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి 2014లో ప్రజ్ఞారెడ్డితో వివాహం జరిగింది. ప్రజ్ఞారెడ్డి తండ్రి కేఆర్ఎం రెడ్డి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. పెళ్లి తర్వాత కొంతకాలానికే ఏక్ నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నాంటూ ప్రజ్ఞారెడ్డి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పుల్లారెడ్డి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పీఎస్ లో గృహహింస చట్టం కింద కేసు కూడా నమోదైంది.

The daughter-in-law of the owner of 'Pullareddy Sweets' has written to the President asking for justice


Daughter-in-law Pragya Reddy has said that Pullareddy Sweets family dispute is harassing her once again Revealed that they tried to kill him and his daughter*



The daughter-in-law Prajna Reddy wrote to the President of India Draupadi Murmu to protect her from the owner of Pullareddy Sweets G. Raghavareddy, his wife Bharti Reddy and their daughter Srividya Reddy. Prajna Reddy alleged that Raghavar Reddy, Bharathi Reddy and Srividya Reddy have been harassing her and her eight-year-old daughter for the last two years. She explained that in the past they tortured her for dowry and built a wall night after night to prevent her from leaving the room. Pragya Reddy explained that the court responded and said that the wall should be demolished. Moreover, in his letter he expressed concern that they tried to kill him and his daughter. He also disclosed that there are land grab cases against his aunt Bharti Reddy in Hyderabad. I am writing this letter to you with the thought that as a woman, you will understand the pain of a fellow woman... Pragya Reddy appealed to President Draupadi Murmu saying, "Justice for me and my child".

As the successor of the founder of Pullareddy Sweets, G. Pullareddy, his son G. Raghavareddy is looking after the affairs of Pullareddy Group. His son Ek Nath Reddy got married to Pragya Reddy in 2014. Prajna Reddy's father KRM Reddy is in the mining business. Some time after the marriage, differences arose between Ek Nath Reddy and Prajna Reddy. Prajna Reddy had earlier complained to the police that her husband and in-laws were harassing her. At that time, a case was also registered against Pullareddy's family members under Domestic Violence Act in Panjagutta PS.

Post a Comment

0 Comments