జోగుళాంబ గద్వాల్, తెలంగాణ:
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ టి.శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు ఈ రోజు కోదండాపూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ ప్రాంగణం, రికార్డులు, సిబ్బంది క్రమశిక్షణ, యూనిఫార్మ్ టర్న్ ఔట్ మరియు మొత్తం నిర్వహణపై ఆయన సమీక్ష చేపట్టారు.
తనిఖీ సందర్భంగా ఎస్పీ గారు కోదండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేషనల్ హైవే-44 (NH-44) రోడ్డుపై రోడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే “బ్లాక్ స్పాట్స్” ను గుర్తించి, తగిన ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాత్రి సమయంలో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి విశ్రాంతి తీసుకునే లారీ, ట్రక్ డ్రైవర్లకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని, ప్రమాదాలు నివారించేందుకు విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు చురుకుగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సూచించారు.
సమాజ పోలీసింగ్ (Community Policing) ప్రాముఖ్యతను వివరించిన ఎస్పీ గారు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరపాలని సూచించారు. అలాగే సైబర్ నేరాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సీసీ కెమెరాల ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.
స్టేషన్ నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ గారు, తనిఖీ ముగింపు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐ రవిబాబు పాల్గొన్నారు.
– పి.ఆర్.ఓ., జిల్లా పోలీస్ కార్యాలయం, జోగుళాంబ గద్వాల్ జిల్లా

0 Comments