OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

District SP Sri Vakul Jindal IPS personally participated in the annual firing exercise process of Bapatla District Police

 బాపట్ల జిల్లా పోలీస్ వార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రియలో స్వయంగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు

6 రకాల అత్యాధునిక ఆయుధాలతో 70 రౌండ్ లు ఫైరింగ్ చేసిన జిల్లా ఎస్పీ గారు

శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకం

అత్యవసర సమయాలలో ప్రజల, ప్రభుత్వ, ధన, ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలి

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ గారు

శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు తెలిపారు. ఫిబ్రవరి 15 బుధవారం ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని  ఫైరింగ్ రేంజ్ లో బాపట్ల జిల్లా సాయుధ బలగాల వార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రియను బాపట్ల జిల్లా ఎస్పీ  గారు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైరింగ్ రేంజ్ లో తుపాకీ చేతపట్టి ఎస్పీ గారు సాధన చేశారు. అలాగే పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది తుపాకులు చేతబట్టి ఫైరింగ్ సాధనలో పాల్గొన్నారు.

 వార్షిక ఫైరింగ్ సాధనలో భాగంగా  ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి నందు గల ఫైరింగ్ రేంజ్ ను జిల్లా ఎస్పీ గారు సందర్శించి తర్ఫీదు పొందుతున్న బాపట్ల జిల్లా AR పోలీసు అధికారులు, సిబ్బందికి ఫైరింగ్ ప్రక్రియ గూర్చి ఎస్పీ గారు పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు స్వయంగా పాల్గొని నీల్ పోజిషన్, స్టాండింగ్ పొగజిషన్ లో 6 రకాల అత్యాధునిక ఆయుధాలతో 70 రౌండ్ లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ వార్షిక ఫైరింగ్ జరగుతున్న నేపథ్యంలో ఫైరింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మంచి మెళకువలు నేర్చుకొని, ఫైరింగ్ నందు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.  ప్రతి ఒక్క బుల్లెట్టు టార్గెట్ (లక్ష్యం) వైపే బుల్ పడే విధంగా తర్పీదు పొందాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని, అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జిల్లా పోలీసు శాఖ యొక్క ఉన్నతి కోసం ముందడుగు వేయాలని సూచించారు. కొత్తగా వచ్చిన ఆయుధాల గురించి పూర్తి స్ధాయిలో తర్ఫీదు పొంది, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకొని అత్యవసర సమయాలలో ప్రజల, ప్రభుత్వ, ధన, ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు బాపట్ల జిల్లా అదనపు ఎస్పి పి.మహేష్ గారు, బాపట్ల జిల్లా AR- డిఎస్పి యం.డి.హెచ్. ప్రేమ్ కుమార్ గారు, బాపట్ల డిఎస్పి ఏ.శ్రీనివాసరావు గారు, చీరాల డిఎస్పి పి.శ్రీకాంత్ గారు, బాపట్ల SB-ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాస్ గారు, అడ్మిన్ ఆర్ఐ ఎల్.మన్మధ రావు గారు, వెల్ఫేర్ ఆర్ఐ బి.శ్రీకాంత్ నాయక్ గారు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


District SP Sri Vakul Jindal IPS personally participated in the annual firing exercise process of Bapatla District Police

District SP who fired 70 rounds with 6 types of advanced weapons

The services of the Armed Forces Police are very important in the maintenance of law and order

One should always be ready to protect people, government, money and life in emergency times

Bapatla District SP Sri Vakul Jindal IPS Garu

Bapatla District SP Sri Vakul Jindal IPS said that the services of the armed forces police are very important in maintaining peace and security. The Bapatla District SP personally inspected the annual firing practice of the Bapatla District Armed Forces at the firing range in Cheemakurti, Prakasam District on Wednesday, February 15. On this occasion, the SP practiced holding a gun in the firing range. Also, many police officers and personnel took part in the firing practice with guns.

      As part of the annual firing practice, the district SP visited the firing range at Cheemakurti in Prakasam district and informed the officers and staff of Bapatla district AR police officers and staff about the firing process. The District SP personally participated in this program and fired 70 rounds with 6 types of advanced weapons in kneel position and standing position and filled the staff with enthusiasm and morale.

    On this occasion, the District SP said that in the background of the annual firing, everyone should participate in the firing and learn good techniques and clear the doubts in the firing. It is advised to get the target in such a way that each bullet falls towards the target. It is suggested that the services of armed forces police are very important in the maintenance of law and order, similarly, steps should be taken for the upliftment of the district police department by taking advantage of the available technology. It is suggested that they should be fully informed about the new weapons, utilize the available technology and be ready at all times for the protection of people, government, money and life in emergencies.

In this program, along with District SP, Bapatla District Additional SP P. Mahesh, Bapatla District AR-DSP Y.D.H. Prem Kumar, Bapatla DSP A. Srinivasa Rao, Chiral DSP P. Srikanth, Bapatla SB-Inspector A. Srinivas, Admin RI L. Manmadha Rao, Welfare RI B. Srikanth Naik and other officers and staff participated.

Post a Comment

0 Comments